
భారత్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలై బాధలో ఉన్న ఆస్ట్రేలియాకు గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఢిల్లీ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు మిచెల్ స్టార్క్ కూడా ఫిట్‌నెస్ సాధించినట్లు సమాచారం. అతడు కూడా జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇక ఇది ఇలా ఉండగా.. రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా ఆదనంగా మరో స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్‌ను జట్టులో చేర్చుకోనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఢిల్లీ వేదికగా శుక్రవారం(ఫిబ్రవరి 17) నుంచి ప్రారంభం కానుంది.
టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు
ప్యాట్ కమిన్స్(కెప్టెన్), స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), ఆష్టన్ అగర్(లెఫ్టార్మ్ స్పిన్నర్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, పీటర్ హాండ్స్‌కోంబ్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్(రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్), లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ(రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్), మాథ్యూ రేన్షా, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్(రైట్ ఆర్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్), డేవిడ్ వార్నర్,మాథ్యూ కుహ్నెమన్
చదవండి: Wasim Jaffer: ఏక కాలంలో ఒకరిని మెచ్చుకొని.. మరొకరిని తిట్టుకొని
Comments
Please login to add a commentAdd a comment