
మెల్‌బోర్న్: అసలే భారత్‌తో సొంతగడ్డపై ఎదురైన పరాభవాల నుంచి కోలుకోని ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ పేసర్, వైస్ కెప్టెన్ హాజల్‌వుడ్ గాయంతో ఆటకు దూరమయ్యాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న అతను త్వరలో శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొనడంలేదు. ఈ ఆసీస్ వైస్ కెప్టెన్ గతేడాది కూడా వెన్నుగాయంతో ఇబ్బందిపడ్డాడు.
మరోవైపు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఫిజియోథెరపిస్ట్ డేవిడ్ బెక్లే తమ పేసర్... ప్రపంచకప్ సమయానికల్లా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాడనే ధీమా వ్యక్తం చేశారు. స్కానింగ్‌లో కింది వెన్నుభాగంలో ఇబ్బందులున్నట్లు తేలింది. త్వరలోనే అతనికి పునరావాస శిబిరంలో శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు. లంకతో డేనైట్‌లో జరిగే తొలిటెస్టు ఈ నెల 24న బ్రిస్బేన్‌లో మొదలవుతుంది. అనంతరం రెండో టెస్టు వచ్చే నెల 1 నుంచి కాన్‌బెర్రాలో జరుగుతుంది.