
సిడ్నీ: త్వరలో స్వదేశంలో ఇంగ్లండ్ తో జరగబోయే యాషెస్ సిరీస్ కు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆస్ట్రేలియా పేసర్ జోష్ హజల్ వుడ్ ప్రకటించుకున్నాడు. యాషెస్ కు సన్నాహకంలో భాగంగా జరిగిన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ లో ఆరు వికెట్లతో రాణించిన హజల్ వుడ్.. తన ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే యాషెస్ కు సిద్ధమైన విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు తెలియజేశాడు. యాషెస్ లో ఆస్ట్రేలియా పేస్ అటాక్ త్రయం మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జాక్సన్ బర్డ్ లకు జతగా హజల్ వుడ్ అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గాయం కారణంగా నాథల్ కౌల్టర్ నైల్ దూరమైన నేపథ్యంలో ఆ స్థానాన్ని హజల్ వుడ్ భర్తీ చేసే అవకాశం ఉంది. ఆసీస్ నలుగురు బౌలర్లతో మొదటి టెస్టుకు సిద్ధమైతే మాత్రం హజల్ వుడ్ కు తుది జట్టులో చోటు దాదాపు ఖాయం. ఈ క్రమంలోనే తన ఎంపికను పరిగణలోకి తీసుకోవాలంటూ సీఏకు హజల్ వుడ్ ముందుగా సంకేతాలు పంపాడు.
Comments
Please login to add a commentAdd a comment