భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు సర్వం సిద్దమైంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ బుధవారం(జూన్7) మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభం కానుంది. దాదాపు పదేళ్లగా ఐసీసీ ట్రోఫీ నెగ్గని భారత జట్టు.. ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. పటిష్ట ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ గడ్డపై మట్టికరిపించేందుకు రోహిత్ సేన వ్యూహాలు రచిస్తోంది.
మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఇక మ్యాచ్ జరిగే ఓవల్‌లో పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో, ఐదు రోజుల పాటు వాతవారణం ఎలా ఉంటుందో ఓ లూక్కేద్దం.
పిచ్ రిపోర్ట్
సాధారణగా ఓవల్ పిచ్‌పై మంచి బౌన్స్ ఉంటుంది. అది పేసర్లకు అనుకూలం కాగా, మంచి షాట్‌లకు కూడా అవకాశం ఉంటుంది. స్వింగ్ ప్రభావం తక్కువ. నిలదొక్కుకుంటే బ్యాటర్లు చక్కగా పరుగులు రాబట్టవచ్చు. అయితే జూన్ నెలలో తొలిసారి ఈ మైదానంలో టెస్టు జరుగుతుండటంతో ఎవరికీ పిచ్‌పై పూర్తి స్పష్టత లేదు.
వాతావరణం
జూన్ మొదటి వారంలో ఇంగ్లండ్‌లో వేసవి కాలం మొదలవుతుంది. కాబట్టి మ్యాచ్ జరిగే తొలి మూడు రోజులు వాతావారణం క్లియర్‌గా ఉంటుందని, ఆఖరి రెండు రోజుల్లో తెలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అక్కడి వాతావారణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఒక వర్షం అంతరాయం కలిగించిన ఈ ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్‌డే ఉంది కాబట్టి పెద్దగా సమస్యలేదు. జూన్ 12ను ఐసీసీ రిజర్వ్ డేగా నిర్ణయించింది.
చదవండి: WTC Final: "ద బాస్".. ఇక్కడి దాకా తీసుకొచ్చాడంటే, గెలిపిస్తాడంతే..!
Comments
Please login to add a commentAdd a comment