వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్లో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు తుది జట్టులో స్థానం లభించికపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. వరల్డ్ నంబర్ వన్ బౌలర్ అశ్విన్‌ను పిచ్ పరిస్థితుల దృష్ట్యా తుది జట్టులోకి తీసుకోలేకపోయామని మేనేజ్‌మెంట్ వివరణ ఇస్తున్నప్పటికీ, అభిమానులు మాత్రం ఈ వివరణతో సంతృప్తి చెందడం లేదు.
కీలక మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ అయిన అశ్విన్‌ను విస్మరించడంపై వారు పెదవి విరుస్తున్నారు. మ్యాచ్ విన్నర్‌ను ఎలా పక్కకు పెడతారని కెప్టెన్, కోచ్‌లను నిలదీస్తున్నారు. మ్యాచ్ స్టార్ట్ అయ్యాక పిచ్ పేసర్లకు సహకరించడం చూశాక కూడా అభిమానులు ఈ విషయాన్ని వదిలిపెట్టడం లేదు. సోషల్‌మీడియా వేదికగా మేనేజ్‌మెంట్‌పై విమర్శినాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు.
అశ్విన్ విషయంలో అభిమానుల హడావుడి నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. అదేంటంటే.. ఇంగ్లండ్‌లో అశ్విన్ ఆడిన దాదాపు ప్రతి మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడం. ఇక్కడ అశ్విన్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో టీమిండియా ఏకంగా ఆరింటిలో ఓటమిపాలైంది. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందింది.
ఇది ఉదహరిస్తూ.. అశ్విన్ అంటే గిట్టని కొందరు చెడు ప్రచారం చేస్తున్నారు. అశ్విన్‌ను ఆడించకపోవడమే మంచిదైందంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇంగ్లండ్ పరిస్థితుల్లో అశ్విన్ కంటే శార్దూల్ ఠాకూరే బెటర్ ఛాయిస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి అశ్విన్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి..? అతన్ని ఆడించకపోవడం టీమిండియాకు ప్లసా.. మైనసా..? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్ 2021-23లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సిరాజ్.. నాలుగో ఓవర్‌లోనే ఉస్మాన్ ఖ్వాజాను ఔట్ చేసి బ్రేక్ ఇచ్చినప్పటికీ, టీమిండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. 20 ఓవర్ల తర్వాత ఆసీస్ వికెట్ నష్టానికి 62 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. వార్నర్ (39), లబూషేన్ (22) క్రీజ్‌లో ఉన్నారు.
చదవండి: WTC Final: నల్ల రిబ్బన్లతో టీమిండియా, ఆసీస్ ఆటగాళ్లు?
Comments
Please login to add a commentAdd a comment