ది ఓవల్ వేదికగా జూన్ 7నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరిన భారత జట్టు.. ఈసారి ఎలాగైనా విజయం సాధించి వరల్డ్ ఛాంపియన్ నిలవాలని భావిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఈ మ్యాచ్‌లో అత్యతుత్తమ ప్రదర్శన కనబరిచి డబ్ల్యూటీసీ టైటిల్‌ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని యోచిస్తోంది.
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు భారత ఫాస్ట్ బౌలర్లకు పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ ఓ విలువైన సలహా ఇచ్చాడు. ఓవల్ మైదానంలో బంతి సాధారణంగా స్వింగ్ అవుతుంది కాబట్టి బౌలర్లు మరీ అత్యుత్సహం చూపించల్సిన అవసరం లేదని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా షమీ, సిరాజ్ వంటి ప్రధాన బౌలర్లు సరైన వ్యూహాలతో బౌలింగ్ చేయాలని అక్రమ్ సూచించాడు.
"భారత జట్టులో అనుభవజ్ణలైన బౌలర్లు ఉన్నారు. ఓవల్‌లో తొలి 10,15 ఓవర్ల పాటు బంతికి అద్బుతంగా స్వింగ్ అవుతుందని అందరికీ తెలుసు. కాబట్టి భారత బౌలర్లు కొత్త బంతితో అత్యుత్సాహం చూపించాల్సిన అవసరం లేదు. అత్యుత్సాహం చూపించి ఆ 10, 15 ఓవర్లలో ఫాస్ట్ బౌలర్లు అదనపు పరుగులు ఇవ్వకూడదు.
ఇన్నింగ్స్ ప్రారంభంలో కాస్త బౌన్స్ లభించిందని ఉత్సాహపడకండి. ఆస్ట్రేలియన్లకు కావాల్సింది అదే" అని ఐసీసీ షేర్ చేసిన వీడియోలో అక్రమ్ చెప్పుకొచ్చాడు. కాగా 140 ఏళ్ల ఓవల్ మైదానం చరిత్రలో జూన్ ప్రారంభంలో ఓ టెస్టు మ్యాచ్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి. కాబట్టి పిచ్ ఎలా సహకరిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే విషయంపై అక్రమ్ కూడా స్పందించాడు.
ఓవల్ పిచ్ సాధారణంగా ఉపఖండంలోని జట్లకు అనుకూలంగా ఉంటుంది. మేము ఇక్కడ ఆడినప్పుడల్లా మాకు ఒక ఛాలెంజ్‌గా ఉండేంది. అయితే సాధారణంగా ఇక్కడ టెస్టు మ్యాచ్‌లు ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ ప్రారంభంలో జరిగేవి. కానీ ఈ సారి భిన్నంగా జూన్ ఆరంభంలో జరగుతుంది. పిచ్ ఫ్రెష్‌గా ఉంది.
కాబట్టి డ్యూక్ బంతి ఎక్కువగా బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని అక్రమ్ పేర్కొన్నాడు. . కాగా సాధారణంగా టెస్టు క్రికెట్‌లో కూకబుర్ర బంతిని వాడుతారు. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో మాత్రం డ్యూక్ బంతిని ఐసీసీ ఉపయోగించనుంది.
చదవండి: IND vs WI: విండీస్‌తో టీ20 సిరీస్.. కెప్టెన్‌గా హార్దిక్! విధ్వంసకర ఓపెనర్ ఎంట్రీ! రింకూ కూడా
Comments
Please login to add a commentAdd a comment