భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ మ్యాచ్ జరగున్న సంగతి తెలిసిందే. జాన్ 7 నుంచి జూన్ 11 వరకు లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఈ తుది పోరు జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి ప్రపంచ ఛాంపియన్స్‌గా నిలవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్‌లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ కూడా చేరాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకునే అవకాశాలు భారత్ కంటే ఆస్ట్రేలియాకే ఎక్కువగా ఉన్నాయని అక్రమ్ అభిప్రాయపడ్డాడు.
"ఓవల్‌లో సాధరణంగా టెస్టు మ్యాచ్‌లు ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటిలో జరగుతాయి. అప్పడు పిచ్ బాగా డ్రైగా ఉంటుంది. కాబట్టి బ్యాట్లరకు అనుకూలంగా ఉటుంది. కానీ ఢబ్ల్యూటీసీ పైనల్ మాత్రం జూన్‌లో జరగుతుంది. కాబట్టి పిచ్ ఇప్పుడు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. దీంతో పిచ్‌లలో బంతి బౌన్స్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది.
అదే విధంగా డ్యూక్ బంతి ఎక్కువగా స్వింగ్ కూడా అవుతోంది. డ్యూక్ బంతి కూకబుర్ర కంటే చాలా గట్టిగా ఉంటుంది. ఆసీస్ బౌలర్లు ఎక్కువగా బౌన్సర్లు వేస్తే భారత బ్యాటర్లు కచ్చితంగా ఇబ్బంది పడతారు.
భారత బౌలింగ్ ఎటాక్ ఆస్ట్రేలియాతో పోలిస్తే కాస్త వీక్‌గా ఉంది. నా వరకు అయితే ఆస్ట్రేలియానే టైటిల్ ఫేవరేట్" అని ఓ ఐసీసీ ఈవెంట్‌లో అక్రమ్ పేర్కొన్నాడు. కాగా సాధారణంగా టెస్టు క్రికెట్‌లో కూకబుర్ర బంతిని వాడుతారు. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో మాత్రం డ్యూక్ బంతిని ఐసీసీ ఉపయోగించనుంది.
చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్..!
Comments
Please login to add a commentAdd a comment