Virat Kohli posts another spiritual story: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతర క్రికెటర్లెవరికీ సాధ్యం కాని రీతిలో 253 మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉన్నాడు ఈ రన్‌మెషీన్. ట్విటర్‌లోనూ ఈ రికార్డుల కింగ్‌కు ఫాలోయింగ్ ఎక్కువే.
ప్రస్తుతం కోహ్లి ట్విటర్ ఖాతాకు 56.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఎప్పటికప్పుడు వృత్తిగత, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసే కోహ్లి గత రెండ్రోజులుగా ఫుల్ యాక్టివ్ అయిపోయాడు. వరుస పోస్టులతో ముందుకు వస్తున్నాడు.
ఈగో నుంచి బయటపడేసేది అదే
మొన్నటికి మొన్న జిమ్ వీడియో షేర్ చేసిన ఈ మాజీ సారథి.. తాజాగా క్రిప్టిక్ పోస్టు షేర్ చేశాడు. ‘‘మెదుడు అనుమానాలతో సతమతం అవుతుంది. అదే మనసులో ఎల్లప్పుడూ నమ్మకంతో ముందుకు సాగుతుంది. నిజానికి.. ఈగో మైండ్ నుంచి బయటపడేందుకు నమ్మకమే ఓ వారధిలా పనిచేస్తుంది’’ అన్న కోట్‌ను ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నాడు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
స్థాయికి తగ్గట్లు రాణించలేదు
కాగా కోహ్లి ఇటీవల ముగిసిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లో ఆడాడు. ఇంగ్లండ్‌లోని ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడిన టీమిండియా ఈ మ్యాచ్‌లో 209 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఇక ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో కోహ్లి విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 14 పరుగులే చేసిన విరాట్.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకానికి పరుగు దూరంలో నిలిచిపోయాడు.
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత టీమిండియా ఆటగాళ్లకు దాదాపు నెలరోజుల పాటు విశ్రాంతి లభించింది. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి సెలవులను ఆస్వాదిస్తున్నారు పలువురు క్రికెటర్లు. కాగా తదుపరి జూలై 12- ఆగష్టు 13 వరకు టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో బిజీ కానుంది.
చదవండి: Ind Vs WI: విండీస్‌కు కష్టాలు! సందిగ్దంలో టీమిండియాతో టెస్టు సిరీస్!
ధోనికి పిల్లనిచ్చిన అత్తగారు! ఆ కంపెనీ సీఈఓ.. రూ. 800 కోట్ల సామ్రాజ్యం!
Comments
Please login to add a commentAdd a comment