Virat Kohli does weight training in gym: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి జిమ్‌లో చెమటోడుస్తున్నాడు. వర్కౌట్లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘‘సాకులు వెదుక్కుంటారా? లేదంటే మరింత మెరుగవుతురా?’’ అన్న అర్థంలో క్యాప్షన్ జత చేసి మరోసారి ఫిట్‌నెస్ గోల్స్ సెట్ చేశాడు. కోహ్లి షేర్ చేసిన వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది.
కాగా అత్యంత ఫిట్‌గా ఉండే క్రికెటర్ అనగానే కోహ్లి పేరే గుర్తుకువస్తుందనడంలో సందేహం లేదు. ప్రపంచంలోని అథ్లెట్లందరిలో కూడా ఫిట్‌నెస్ విషయంలో కోహ్లి ముందుంటానడం అతిశయోక్తి కాదు. మైదానంలో పరుగుల వరద పారించే ఈ రన్ మెషీన్ ఫిట్‌నెస్ సమస్యల కారణంగా జట్టుకు దూరమైన సందర్భాలు అరుదు.
కాగా కోహ్లి ఇటీవల జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో భాగమయ్యాడు. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో అతడు స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసిన ఈ స్టార్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 49 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.
కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రతిష్టాత్మక ఐసీసీ మెగా మ్యాచ్‌లో టీమిండియా ఆసీస్ చేతిలో ఏకంగా 209 పరుగుల తేడాతో చిత్తైంది. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినప్పటికీ ట్రోఫీ గెలవలేక విమర్శలు మూటగట్టుకుంది. కాగా జూన్ 7-11 వరకు జరిగిన ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా ఆటగాళ్లకు దాదాపు నెలరోజుల పాటు విశ్రాంతి లభించింది.
ఇక జూలై 12- ఆగష్టు 13 వరకు వెస్టిండీస్ పర్యటనతో భారత జట్టు మళ్లీ బిజీ కానుంది. విండీస్‌తో రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి కేవలం టెస్టు సిరీస్ మాత్రమే ఆడి వెస్టిండీస్ నుంచి తిరుగు ప్రయాణం కానున్నట్లు సమాచారం. ఇక జూన్ 27న.. విండీస్ టూర్‌కు వెళ్లే జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.
చదవండి: నువ్వెందుకు బౌలింగ్ చేస్తున్నావు? కావాలంటే మీకు కూడా.. అంతేగానీ! ధోని ఆ ఒక్క మాటతో
2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్‌గా.. ఒక్కడే కాదు
Comments
Please login to add a commentAdd a comment