
లండన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు. వార్నర్ చాలా ప్రమాదకరమరని విరాట్ కొనియాడాడు. "వార్నర్ ఆస్ట్రేలియాకు ఇంపాక్ట్ ప్లేయర్. అతడు మంచి టచ్‌లో ఉన్నప్పుడు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడు.
అతడిని త్వరగా ఔట్ చేయకపోతే ఆటను మన నుంచి లాగేసుకుంటాడు. అతడు బౌండరీలు కొట్టడం ప్రారంభంచిండంటే అపడం చాలా కష్టం. కాబట్టి డేవిడ్ భాయ్‌కు ఎటువంటి అవకాశాలు ఇవ్వకూడదు. అతడు ఆస్ట్రేలియా తరపున టెస్టు క్రికెట్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. వార్నర్ చాలా ప్రమాదకరమైన ఆటగాడు. అతడిని తొందరగా పెవిలియన్‌కు పంపేందుకు మేము ఇప్పటికే వ్యూహాలు రచించాము" అని ఐసీసీ షేర్ చేసిన వీడియోలో కోహ్లి పేర్కొన్నాడు.
భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లి, రహానే, రవీంద్ర జడేజా, భరత్, అశ్విన్, షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్
చదవండి: WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆందోళనకారుల ముప్పు.. ఐసీసీ కీలక నిర్ణయం
Virat Kohli knows the impact David Warner can have in a big match 💪🏻#WTC23https://t.co/xTsNVc8mg1
— ICC (@ICC) June 7, 2023