
ఓవల్ వేదికగా వేదికగా జూన్ 7న ప్రారంభం కానున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్- ఆస్ట్రేలియా జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను ఆరోన్ ఫించ్ ఎంపిక చేశాడు. అయితే తన జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్‌కు ఛాన్స్ ఇచ్చాడు.
ఇక ఫస్ట్ డౌన్‌లో వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా, సెకెండ్ డౌన్‌లో విరాట్ కోహ్లిని ఫించ్ ఎంపిక చేశాడు. ఐదు ఆరు స్థానాల్లో వరుసగా రహానే, ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇచ్చాడు. అదే విధంగా తన జట్టులో ఇద్దరు స్పినర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను కూడా ఎంపిక చేశాడు.
ఇక ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే.. మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, శార్థూల్ ఠాకూర్‌కు ఫించ్ చోటిచ్చాడు. అయితే ఫించ్ తన జట్టులో వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్‌ను కాకుండా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయడం గమనార్హం. అదే విధంగా పేసర్ ఉమేష్ యాదవ్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు.
ఫించ్ ఎంపిక చేసిన భారత తుది జట్టు: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
చదవండి: ENG vs IRE: బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలోనే తొలి కెప్టెన్‌గా!
Comments
Please login to add a commentAdd a comment