టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ విమర్శల వర్షం కురిపించాడు. ఈ కీలక మ్యాచ్‌లో ద్రవిడ్ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడని అలీ విరుచుకుపడ్డాడు. అదే విధంగా ద్రవిడ్ అద్భుతమైన ఆటగాడు అయినప్పటికీ కోచ్‌గా మాత్రం జీరో అని అలీ అన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు ప్రదర్శన చూసి అలీ ఈ వాఖ్యలు చేశాడు. "టీమిండియా ఎప్పుడైతే తొలుత బౌలింగ్ ఎంచుకుందో అప్పుడే ఈ మ్యాచ్‌ను కోల్పోయింది.
ఇక భారత్ బౌలింగ్ కూడా ఐపీఎల్లోలాగే ఉంది. తొలి రోజు లంచ్ సమయానికి.. భారత బౌలర్లు ఏకంగా మ్యాచ్ గెలిచినట్లు చాలా సంతోషంగా కనిపించారు. ఇప్పుడు భారత జట్టు ముందు ఒక్కటే మార్గం. ఆసీస్‌ను వీలైనంత తొందరగా ఔట్ చేసి, భారత్ బ్యాటింగ్‌కు వచ్చి అద్బుతాలు సృష్టించాలి. అదే విధంగా ఫీల్డింగ్‌లో కూడా భారత ఆటగాళ్లు అంత ఫిట్‌నెస్‌గా కనిపించలేదు. రహానే, కోహ్లి, జడేజా మినహా చాలా మంది ప్లేయర్లు బాగా అలసిపోయినట్లు కనిపించారు" అని అలీ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
ఇక ద్రవిడ్ గురించి మాట్లాడుతూ.. "నేను రాహల్ ద్రవిడ్‌కు వీరాభిమానిని. గతంలో ఇదే విషయం చాలా సార్లు చెప్పాను. అతడొక క్లాస్ ప్లేయర్, లెజెండ్. కానీ కోచ్‌గా మాత్రం అతడు జీరో. భారత్‌లో టర్నింగ్ పిచ్ లు తయారు చేయించారు. నాకు ఒక్కదానికి సమాధానం చెప్పండి. మీరు ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు అక్కడ అలాంటి పిచ్ లే ఉన్నాయా? అక్కడ బౌన్సీ పిచ్ లు ఉన్నాయా? ద్రవిడ్ ఏమీ ఆలోచిస్తున్నాడో ఆ దేవుడుకే తెలియాలంటూ ఘూటు వాఖ్యలు చేశాడు.
చదవండి: WTC Final: ఆసీస్ పేసర్ సూపర్ డెలివరీ.. భరత్‌కు దిమ్మతిరిగిపోయింది! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment