టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్ సారథిగా తనను తప్పించడంతో బ్యాటింగ్‌పైన దృష్టి పెట్టిన హిట్‌మ్యాన్... వరల్డ్‌కప్ నాటికి పూర్తి ఫామ్‌లోకి రావాలని పట్టుదలగా ఉన్నాడు.
ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిపి 156 పరుగులు చేశాడు హిట్‌మ్యాన్. తాజాగా ఆర్సీబీతో గురువారం నాటి మ్యాచ్‌లో తనదైన షాట్లతో అలరించి ముంబై విజయంలో తానూ భాగమయ్యాడు.
From @Jaspritbumrah93's brilliance to that dominating chase! 👌 👌
— IndianPremierLeague (@IPL) April 12, 2024
A quick recap to sum up @mipaltan's 2️⃣nd win on the bounce at Wankhede Stadium 🎥 🔽 #TATAIPL | #MIvRCB pic.twitter.com/A8sroBjcm0
ఇదిలా ఉంటే.. 36 రోహిత్ శర్మకు వయసు పైబడుతున్న దృష్ట్యా అతడిని టీమిండియా సారథిగానూ తప్పించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు బలంగా వినిపిస్తుండగా.. టెస్టులకు పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రాకు కెప్టెన్‌ను చేస్తే బాగుంంటుందని విశ్లేషకులు అంటున్నారు.
అయితే, బీసీసీఐ మాత్రం టీ20 ప్రపంచకప్-2024లోనూ రోహిత్ శర్మనే టీమిండియాను ముందుకు నడిపిస్తాడని స్పష్టం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో రిటెర్మెంట్‌పై రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
‘‘ఇప్పటి వరకు నేను రిటైర్మెంట్ గురించి అసలు ఆలోచించనేలేదు. అయితే, జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చెప్పలేం కదా! ఇప్పటికీ నేను బాగానే ఆడుతున్నాను.
మరికొన్నేళ్ల పాటు ఆడగలననే అనుకుంటున్నా. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. వరల్డ్‌కప్ గెలవాలనుకుంటున్నాను. ఇంకా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2025 ఫైనల్ కూడా ముందు ఉంది.
టీమిండియా గెలుస్తుందనే అనుకుంటున్నా’’ అని ఇప్పట్లో తనకు రిటైర్ అయ్యే ఆలోచన లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్-2024 ఆరంభం కానుంది.
చదవండి: T20 WC: సెలక్టర్లూ.. అతడిపై ఓ కన్నేసి ఉంచండి: టీమిండియా దిగ్గజం
2027 world cup is locked my man gives signal 😭❤️#RohitSharma𓃵 pic.twitter.com/Aqs2T1xJcz
— Rameshh (@RameshSuriyaa__) April 12, 2024
ఈ క్రమంలో జూన్ 5 ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో టీమిండియా ఈ మెగా టోర్నీలో తన ప్రయాణం ఆరంభించనుంది. ఇక రోహిత్ శర్మ సారథ్యంలో ఇప్పటికే టీ20 ప్రపంచకప్-2022, వన్డే వరల్డ్‌కప్-2023 ఆడిన భారత జట్టు ఒక్క ఈవెంట్‌లోనూ చాంపియన్‌గా నిలవలేకపోయింది. కాగా రోహిత్ శర్మ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో అభిమానులు ఖుషీ అవుతున్నారు. 2027 వరల్డ్‌కప్ వరకు కూడా హిట్‌మ్యానే కెప్టెన్‌గా ఉంటాడంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment