బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని విజయంతో ఆరంభించిన టీమిండియాకు రెండో టెస్టులో మాత్రం బిగ్ షాక్ తగిలింది. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర పరాజయం పాలైంది. 19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా చేధించింది.
బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ముఖ్యంగా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ దారుణ ప్రదర్శన కనబరిచింది. వీరితోపాటు తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన యశస్వి జైశ్వాల్ సైతం తన మార్క్‌ను చూపించలేకపోయాడు.
ఇక ఈ ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్ధానాన్ని కోల్పోయింది. భారత్ విన్నింగ్ శాతం 57.2తో ఏకంగా మూడో స్ధానానికి పడిపోయింది.
దీంతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలు మరింత సన్నగిల్లాయి. ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా(60.71 విన్నింగ్ పర్సంటేజీ) టాప్ ప్లేస్‌కు చేరుకోగా.. దక్షిణాఫ్రికా(59.26 విన్నింగ్ పర్సంటేజీ) రెండో స్ధానానికి ఎగబాకింది.
భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే?
కాగా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఆసీస్‌తో మిగిలిన మూడు టెస్టులు చాలా కీలకం. ఈ మూడు మ్యాచ్‌లలో భారత్ విజయం సాధిస్తే 4-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. అప్పుడు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా రోహిత్ సేన నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెడుతోంది.
అయితే వరుస మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఓడించడం అంత సులభం కాదు. కాబట్టి భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ భవితవ్యం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడిందేనే చెప్పుకోవాలి. డబ్ల్యూటీసీ 2023- 25 సైకిల్‌లో భారత్‌కు ఇదే చివరి సిరీస్ కాగా.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఇంకా సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియా శ్రీలంకతో, సఫారీలు పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడనునున్నాయి. ఆ సిరీస్ ఫలితాలు భారత్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేయనున్నాయి.
👉బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 3-1తో సొంతం చేసుకున్నా కానీ నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించదు. ఒకవేళ అలా జరగాలంటే రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికాను పాకిస్తాన్ 2-0 తేడాతో ఓడించాలి. ప్రోటీస్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉంది. శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ దిశగా సఫారీలు దూసుకుపోతున్నారు. కాబట్టి స్వదేశంలో దక్షిణాఫ్రికాను ఓడించడం పాక్‌కు అంత ఈజీ కాదు.
👉ఒకవేళ ఆసీస్‌తో సిరీస్‌ను భారత్ 3-2తో గెలిస్తే.. అప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ భవితవ్యం శ్రీలంకపై ఆధారపడి ఉంటుంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో కనీసం ఒక మ్యాచ్‌లో విజయం లేదా డ్రా చేసినా చాలు భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెడుతోంది.
చదవండి: ENG vs NZ: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. 16 ఏళ్ల తర్వాత సిరీస్ కైవసం
Comments
Please login to add a commentAdd a comment