లండన్‌లోని ఓవల్ మైదానంలో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్‌తో తలపడేందుకు ఆస్ట్రేలియా సిద్దమైంది. పటిష్ట భారత జట్టును ఎదుర్కొనేందుకు కమ్మిన్స్ సారధ్యంలోని ఆసీస్ వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్‌కు గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా.. నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి బోర్డర్ గవాస్కర్ ట్రొఫీలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని కంగారూ జట్టు భావిస్తోంది.
ఇక ఇది ఇలా ఉండగా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఒక విషయం మాత్రం ఆసీస్ జట్టును తెగ కలవరపెడుతోంది. ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియా జట్టుకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. తమ టెస్టు క్రికెట్ చరిత్రలో లార్డ్స్, హెడ్డింగ్లీ, ట్రెంట్ బ్రిడ్జ్, ఎడ్జ్‌బాస్టన్‌లలో చారిత్రాత్మక విజయాలు నమోదు చేసిన ఆస్ట్రేలియా.. ఓవల్ మైదానంలో మాత్రం తమ మార్క్‌ను చూపించడంలో విఫలమైంది.
1880 నుంచి ఓవల్ మైదానంలో 38 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా కేవలం ఏడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఓవల్‌లో ఆసీస్ జట్టు విజయ శాతం కేవలం 18.42 మాత్రమే. ఇంగ్లండ్ స్టేడియాల్లో ఆస్ట్రేలియాకు ఇదే అత్యల్ప విజయ శాతం కావడం గమనార్హం.
🔜 #WTC23 pic.twitter.com/P5v8UcLHQ3
— Cricket Australia (@CricketAus) June 2, 2023
ఇక ఈ మైదానంలో ఆస్ట్రేలియా గత 50 ఏళ్లలో కేవలం రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది. అయితే ప్రఖ్యాత లార్డ్స్‌లో మాత్రంలో ఆసీస్ జట్టుకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. లార్డ్స్‌లో 29 మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా.. 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. లార్డ్స్‌లో ఆసీస్ విజయ శాతం 43.59గా ఉంది. ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియాకు ఇదే అత్యధిక విజయ శాతం కావడం గమనార్హం.
రెండు రోజుల ముందు మాత్రమే..
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగే ఓవల్ మైదానంలోకి ఇరు జట్లకు రెండు రోజుల ముందు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. కాబట్టి కమ్మిన్స్ అండ్ కో కెంట్ అవుట్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఓవల్ పిచ్ మాత్రం పేసర్‌లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇరు జట్లు కూడా నలుగురు పేసర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.
చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆసీస్‌కు ఆ ఇద్దరంటే భయం పట్టుకుంది: పాంటింగ్
Comments
Please login to add a commentAdd a comment