India Playing XI For WTC Finals 2023: Ravichandran Ashwin Vs Umesh Yadav, Dilemma For Rohit Sharma - Sakshi
Sakshi News home page

WTC Final 2023: అశ్విన్‌ వర్సెస్‌ ఉమేశ్‌ యాదవ్‌.. రోహిత్‌కు కఠిన పరీక్ష!

Published Mon, Jun 5 2023 6:22 PM | Last Updated on Mon, Jun 5 2023 6:59 PM

India Playing XI: Ashwin vs Umesh dilemma for Rohit  - Sakshi

వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్ 2023 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. లండన్‌ వేదికగా జూన్‌ 7 నుంచి జరగనున్న ఈ ఫైనల్‌ పోరులో భారత-ఆస్ట్రేలియా జట్లు తాడోపేడో తెల్చుకోన్నాయి. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ఎంపిక చేయడం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

ప్రస్తుత డబ్ల్యూటీసీ భారత జట్టులో ఇషాన్‌ కిషన్‌, శ్రీకర్‌ భరత్‌ రూపంలో ఇద్దరు వికెట్‌ కీపర్లు ఉన్నారు. ఈ క్రమంలో తుది జట్టులో ఎవరికి అవకాశం ఇవ్వాలో ఆర్ధం కాక భారత జట్టు మెనెజ్‌మెంట్‌ తలలు పట్టుకుటుంది. వీరిద్దరికీ గతంలో ఇంగ్లండ్‌ పరిస్ధితుల్లో ఆడిన అనుభవం లేదు. దీంతో కొంతమంది పవర్‌ హిట్టింగ్‌ చేసే సత్తా ఉన్న కిషన్‌కు అవకాశం ఇవ్వాలని సూచిస్తుంటే.. మరి కొంతమంది అద్భుతమైన వికెట్‌ కీపింగ్‌ స్కిల్స్‌ ఉన్న భరత్‌కు ఛాన్స్‌ ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు.

అయితే కిషన్‌కు నెట్‌ ప్రాక్టీస్‌లో స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది. ఒక వేళ జట్టు సెలక్షన్‌కు కిషన్‌ అందుబాటులో ఉంటే.. ప్లేయింగ్‌ ఎలెవన్‌లో వీరిద్దరిలో ఎవరికీ చోటుదక్కుతుందో మరి వేచి చూడాలి. మరోవైపు ఓవల్‌ పిచ్‌ పేస్‌ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో భారత జట్టు నలుగురు పేసర్లతో బరిలోకి దిగాలని పలువరు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.

నలుగురు పేసర్లతో బరిలోకి దిగాలని టీమిండియా భావిస్తే.. అశ్విన్‌ బెంచ్‌కు పరిమితం అవ్వక తప్పదు. ఎందుకంటే ఫ్రెంట్‌లైన్‌ పేసర్లగా మహ్మద్‌ షమీ, సిరాజ్‌, శార్ధూల్‌ ఠాకూర్‌కు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే భారత జట్టు మెన్‌జెంట్‌ మెంట్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మరో ఆదనపు పేసర్‌ను జట్టులోకి తీసుకోవాలనుకుంటే కచ్చితంగా ఉమేశ్‌ యాదవ్‌కు ఛాన్స్‌ ఇవ్వాలి. ఈ క్రమంలో అశ్విన్‌ బయట కూర్చోవాల్సిందే. మరి టీం మెనెజ్‌మెం‍ట్‌ ఏ నిర్ణయం తీసుకుంటారో మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.
చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్‌ షాక్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement