Ravichandran Ashwin Fully Fits Ahead WTC Final 2023 - Sakshi
Sakshi News home page

WTC final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌

Published Sat, May 27 2023 2:10 PM | Last Updated on Sat, May 27 2023 2:42 PM

Ravichandran Ashwin fully fit ahead Wtc Final 2023 - Sakshi

ఆస్ట్రేలియాతో వరల్డ్‌టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌ అందింది. వెన్ను నొప్పితో బాధపడుతున్న భారత వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. ఐపీఎల్‌-2023లో రాజస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన అశ్విన్‌.. తమ జట్టు ఆఖరి మ్యాచ్‌కు దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా మ్యాచ్‌కు అందుబాటులో లేడని రాజస్తాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ తెలిపాడు.

దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అశ్విన్‌ అందుబాటుపై సందేహలు నెలకొన్నాయి. కానీ అశ్విన్‌ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి లండన్‌లో అడుగుపెట్టాడు. లండన్‌కు చేరుకున్న అశూ తన ప్రాక్టీస్‌ను కూడా మొదలపెట్టేశాడు. అక్షర్‌పటేల్‌, ఉమేశ్‌ యాదవ్‌, శార్ధూల్‌ ఠాకూర్‌తో కలిసి ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాడు.

ఇక జూన్‌ 7నుంచి లండన్‌ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే అశ్విన్‌, కోహ్లి, అక్షర్‌పటేల్‌, ఉమేశ్‌ యాదవ్‌, శార్ధూల్‌ ఠాకూర్‌లో కూడిన ఓ బ్యాచ్‌ లండన్‌ చేరుకోగా.. షమీ, శ్రీకర్‌ భరత్‌, శుబ్‌మన్‌ గిల్‌, రోహిత్‌, కిషన్‌, రహానే, జడేజా మరో మూడు రోజుల్లో లండన్‌కు పయనం కానున్నారు. 
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టు:  రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్‌గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లీ, రహానె, ఇషాన్‌ కిషన్‌, కేఎస్‌ భరత్‌(వికెట్‌ కీపర్‌), అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, షమీ, సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌
చదవండి: అతడు టీమిండియాకు దొరికిన అణిముత్యం.. మా నాన్న ఫేవరేట్‌ ప్లేయర్‌ కూడా: ఏబీడీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement