రోహిత్ శర్మ (PC: BCCI)
Rohit Sharma trumps Babar Azam, levels Steve Smith: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శతకంతో చెలరేగాడు. ధర్మశాల మ్యాచ్‌లో 13 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 154 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్నాడు.
The Rohit Rumble Show in Dharamshala🏔️🏟️
— JioCinema (@JioCinema) March 8, 2024
Another well-deserved Test 💯for #TeamIndia's maverick skipper 🙌#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/A686RXXgCm
కాగా రోహిత్ శర్మకు టెస్టుల్లో ఇది 12వ శతకం కాగా.. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 48వ సెంచరీ కావడం విశేషం. సొంతగడ్డపై ఇంగ్లండ్‌పై ఆధిపత్యం కొనసాగిస్తూ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత జట్టు ఇప్పటికే 3-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం మొదలైన నామమాత్రపు ఆఖరి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది.
భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ ఐదు(5/72.. వందో టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ నాలుగు(4/51), రవీంద్ర జడేజాకు ఒక వికెట్(1/17) దెబ్బకు 218 పరుగులకే ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా తొలిరోజే బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్(57), రోహిత్ శర్మ అర్ధ శతకాలు బాది శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ కూడా రాణించాడు.
ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 52, శుబ్‌మన్ గిల్ 26 పరుగులతో అజేయంగా నిలిచారు.
ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో రోహిత్ శర్మ శతకం పూర్తి చేసుకోగా.. శుబ్‌మన్ గిల్ సైతం సెంచరీతో చెలరేగాడు. వీరిద్దరి అద్బుత ఇన్నింగ్స్ కారణంగా రెండో రోజు భోజన విరామ సమయానికి టీమిండియా 264/1 స్కోరు నమోదు చేసింది. ఇంగ్లండ్ కంటే ప్రస్తుతం 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఒకే ఒక భారత ఆటగాడు.. బాబర్ ఆజంను వెనక్కినెట్టిన రోహిత్ శర్మ..
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానానికి ఎగబాకాడు. డబ్ల్యూటీసీ ప్రవేశపెట్టిన తర్వాత తాజా శతకంతో కలిపి హిట్‌మ్యాన్ ఖాతాలో మొత్తం 9 సెంచరీలు ఉన్నాయి.
డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక సెంచరీల వీరులు
జో రూట్(ఇంగ్లండ్)- 13
మార్నస్ లబుషేన్(ఆస్ట్రేలియా)- 11
కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)- 10
రోహిత్ శర్మ(ఇండియా)- 9
బాబర్ ఆజం(పాకిస్తాన్)- 8
చదవండి: #Mohammed Shami: మహ్మద్ షమీ సంచలన నిర్ణయం.. క్రికెట్ గుడ్‌బై!? రాజకీయాల్లోకి ఎంట్రీ?
Comments
Please login to add a commentAdd a comment