![India Move To Top Of World Test Championship Points Table After AUS Beat NZ In 1st Test - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/3/teamindia.jpg.webp?itok=P-KPDIzu)
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా మళ్లీ అగ్రస్ధానానికి చేరుకుంది. వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ ఘోర ఓటమి పాలవ్వడం భారత జట్టుకు కలిసొచ్చింది. దీంతో మూడో స్ధానంలో భారత్.. 64.58 విజయ శాతంతో టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లింది.
ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ సేన ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. రెండు మ్యాచ్‌ల్లో ఓటమి, ఒక మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఇక ప్రస్తుత పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్(60.0 శాతం), ఆస్ట్రేలియా(59.09 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఆ తర్వాతి స్ధానాల్లో బంగ్లాదేశ్ (50 శాతం) విజయాలతో నాలుగో స్థానం దక్కించుకోగా.. పాకిస్తాన్ జట్టు 36.66 శాతంతో ఐదో స్టానంలో నిలిచింది. అయితే ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే.. తమ అగ్ర పీఠంలో మరి కొన్ని రోజులు కొనసాగించే ఛాన్స్ ఉంది.
చదవండి: #Shreyas Iyer: దేశం కోసం శ్రేయస్ అయ్యర్ త్యాగం.. బీసీసీఐ తప్పు చేసిందా?
Comments
Please login to add a commentAdd a comment