
అహ్మదాబాద్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించాడు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ మొదలైన తర్వాత అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన మొదటి ఓపెనర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతేగాక టెస్టులో అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన మొదటి ఆసియా ఓపెనర్‌గా.. టీమిండియా నుంచి రెండో ఆటగాడిగా నిలిచాడు. వేగంగా మొదటి టీమిండియా ఆటగాడిగా వినోద్ కాంబ్లికి 14 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. రోహిత్ వెయ్యి పరుగులు పూర్తి చేయడానికి 17 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఆ తర్వాతి స్థానంలో పుజారా(18 ఇన్నింగ్స్‌లు), మయాంక్ అగర్వాల్( 19 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు.
దీంతోపాటు వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆల్‌టైమ్ ఫాస్టెస్ట్ ఓపెనర్ల జాబితాలో దక్షిణాఫ్రికా ఓపెనర్ గ్రేమి స్మిత్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో హెర్బర్ట్ సట్‌క్లిప్ (13 ఇన్నింగ్స్‌లు), లెన్ హుట్టన్ 16 ఇన్నింగ్స్‌లతో రెండో స్థానంలో.. దక్షిణాఫ్రికా ఓపెనర్ గ్రేమి స్మిత్(17 ఇన్నింగ్స్)తో కలిసి రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్‌లో రోహిత్ శర్మ 49 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. రెండో రోజు ఆటలో భాగంగా టీ విరామ తర్వాత టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. పంత్ 48 పరుగులు, సుందర్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment