
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) చరిత్రలో 150 వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్‌గా నిలిచాడు. హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బెన్ డకెట్, జాక్ క్రాలేను ఔట్ చేసిన అశ్విన్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
అదే విధంగా ఓవరాల్‌గా డబ్ల్యూటీసీ హిస్టరీలో ఈ అరుదైన మైలు రాయిని అందుకున్న మూడో బౌలర్‌గా అశూ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో బెన్ డకెట్‌ను ఔట్ చేసి భారత్‌కు తొలి వికెట్‌ను అందించాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో అశ్విన్- రవీంద్ర జడేజా జోడి అరుదైన రికార్డును నెలకొల్పారు.
అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత జోడీగా వీరిద్దరూ నిలిచారు. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు 504 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఈ రికార్డు అనిల్ కుంబ్లే - హర్భజన్ సింగ్(501) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో వారిద్దరి ఆల్‌టైమ్ రికార్డు బద్దలైంది.
చదవండి: IND vs ENG: రోహిత్ శర్మ కళ్లు చెదిరే క్యాచ్.. ఇంగ్లండ్ బ్యాటర్ మైండ్ బ్లాంక్ ! వీడియో
Comments
Please login to add a commentAdd a comment