అలప్పుజ: కమ్యూనిస్టు కురువృద్ధుడు, కేరళ మాజీ సీఎం వెలిక్కకత్తు శంకర్ అచ్యుతానందన్ శుక్రవారంతో 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 2006–11 సంవత్సరాల్లో ఆయన సీఎంగా చేశారు. 1991 నుంచి 2016 దాకా మూడుసార్లు విపక్ష నేతగా ఉన్నారు. వీఎస్‌గా ప్రసిద్ధుడైన ఆయన 82 ఏళ్ల వయసులో సీఎం పదవి చేపట్టిన నేతగానూ రికార్డు సృష్టించారు. స్ట్రోక్ నేపథ్యంలో ఐదేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. చివరికి 2016 ఎన్నికల్లో కూడా కేరళలో వామపక్ష కూటమి వీఎస్‌నే ముందు పెట్టుకుని ప్రచారం చేసింది.
కాంగ్రెస్‌ను ఓడించి అధికారం చేపట్టింది. అభిమానులు ఆయన్ను ఫిడెల్ క్యాస్ట్రో ఆఫ్ కేరళ అని పిలుచుకుంటారు. అలప్పుజ జిల్లా పున్నప్ర గ్రామంలో 1923లో జన్మించిన వీఎస్ 11 ఏళ్లప్పుడే కన్నవారిని పోగొట్టుకున్నారు. మరుసటేడే స్కూలు మానేసి అన్న టైలరింగ్ షాపులో పనికి కుదురుకున్నారు. 15 ఏళ్ల వయసులో కాంగ్రెస్‌లో చేరారు. రెండేళ్ల తర్వాత సీపీఐలోకి మారి పారీ్టలో చకచకా ఎదిగారు. 1964లో సీపీఐ నుంచి బయటికొచ్చి సీపీఎంను ఏర్పాటు చేసిన 32 మంది నేతల్లో వీఎస్ ఒకరు. పుట్టినరోజు సందర్భంగా పలువురు నాయకులు, ప్రముఖులు వీఎస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment