
'పెద్దాయనకు పదవి ఇచ్చే ఆలోచన లేదు'
తిరువనంతపురం: సీపీఎం కురువృద్ధ నేత, మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ కు కేబినెట్ స్థాయి పదవి ఇవ్వనున్నట్టు వచ్చిన వార్తలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. అటువంటి ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు. దీనిపై కేరళ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు.
కాగా, తనకు పదవి కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగలేదని 93 ఏళ్ల అచ్యుతానందన్ తన ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి పోరాడతానని ఆయన ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి విజయం సాధించడంతో ముఖ్యమంత్రి పదవి కోసం పినరయి విజయన్, అచ్యుతానందన్ పోటీ పడ్డారు. చివరకు విజయన్ వైపే పార్టీ పెద్దలు మొగ్గుచూపడంతో అచ్యుతానందన్ కు నిరాశ ఎదురైంది.