Super Smash: Michael Bracewell Smokes Record Score in Amazing Firebirds Win - Sakshi
Sakshi News home page

11ఫోర్లు..11 సిక్స్‌లు.. బౌలర్లకు చుక్కలు చూపించిన ఆటగాడు ఎవరంటే!

Published Sat, Jan 8 2022 12:17 PM | Last Updated on Sat, Jan 8 2022 3:31 PM

Michael Bracewell smokes record score in amazing Firebirds win - Sakshi

సూపర్‌ స్మాష్‌ లీగ్‌లో భాగంగా శనివారం సెంట్రల్ స్టాగ్స్‌తో వెల్లింగ్టన్ ఫైర్‌బర్డ్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో వెల్లింగ్టన్ ఫైర్‌బర్డ్స్ కెప్టెన్‌ మైఖేల్ బ్రేస్‌వెల్ సంచలనం సృష్టించాడు. కేవలం 65 బంతుల్లో 11ఫోర్లు,11 సిక్స్‌లతో 141 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. బ్రేస్‌వెల్ సునామీ ఇన్నింగ్స్‌ ఫలితంగా సెంట్రల్ స్టాగ్స్‌పై వెల్లింగ్టన్ 2 వి​కెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ స్టాగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 227 పరగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.

227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెల్లింగ్టన్ 24 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఇక ఓటమి తప్పదు అనుకున్న సమయంలో కెప్టెన్‌ బ్రేస్‌వెల్ సిక్సర్లు, ఫోర్లులతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో వెల్లింగ్టన్ సంచలన విజయం సాదించింది. కాగా సూపర్‌ స్మాష్‌ లీగ్‌ చరిత్రలోనే వ్యక్తిగతంగా అత్యధిక స్కోర్‌ బ్రేస్‌వెల్‌దే కావడం విశేషం. అదే విధంగా అతడి టీ20 కేరిర్‌లో ఇదే తొలి సెంచరీ.

చదవండి: SA vs IND:"రాహుల్‌ కాదు.. కోహ్లి స్థానంలో కెప్టెన్‌గా అతడే సరైనోడు"

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement