New Zealand batsman
-
11ఫోర్లు..11 సిక్స్‌లు.. బౌలర్లకు చుక్కలు చూపించిన ఆటగాడు ఎవరంటే!
సూపర్ స్మాష్ లీగ్‌లో భాగంగా శనివారం సెంట్రల్ స్టాగ్స్తో వెల్లింగ్టన్ ఫైర్‌బర్డ్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో వెల్లింగ్టన్ ఫైర్‌బర్డ్స్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ సంచలనం సృష్టించాడు. కేవలం 65 బంతుల్లో 11ఫోర్లు,11 సిక్స్‌లతో 141 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. బ్రేస్‌వెల్ సునామీ ఇన్నింగ్స్ ఫలితంగా సెంట్రల్ స్టాగ్స్‌పై వెల్లింగ్టన్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ స్టాగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 227 పరగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెల్లింగ్టన్ 24 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఇక ఓటమి తప్పదు అనుకున్న సమయంలో కెప్టెన్ బ్రేస్‌వెల్ సిక్సర్లు, ఫోర్లులతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో వెల్లింగ్టన్ సంచలన విజయం సాదించింది. కాగా సూపర్ స్మాష్ లీగ్ చరిత్రలోనే వ్యక్తిగతంగా అత్యధిక స్కోర్ బ్రేస్వెల్దే కావడం విశేషం. అదే విధంగా అతడి టీ20 కేరిర్‌లో ఇదే తొలి సెంచరీ. చదవండి: SA vs IND:"రాహుల్ కాదు.. కోహ్లి స్థానంలో కెప్టెన్‌గా అతడే సరైనోడు" The sound off the bat! 😍 Michael Bracewell looking to tee off after a horror start for the Firebirds. Firebirds 38/4 (4.2) Watch play LIVE on @sparknzsport or free-to-air on @TVNZ 1 LIVE scoring https://t.co/v49vrPn7pO #WEAREWELLINGTON #SuperSmashNZ pic.twitter.com/RXCJkmL49h — Cricket Wellington (@cricketwgtninc) January 8, 2022 -
Tim Seifert: కంటతడి పెట్టిన కివీస్ ప్లేయర్
ఆక్లాండ్: భారత్‌లో కోవిడ్ అనుభవాలను గుర్తు చేసుకుంటూ బోరున విలపించాడు కివీస్ డాషింగ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్. ఐపీఎల్ 2021 సీజన్ కోసం భారత్‌కు వచ్చిన ఈ న్యూజిలాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ కరోనా బారిన పడటంతో చాలా రోజుల పాటు ఇండియాలోనే ఉన్నాడు. అయితే ఇటీవలే కరోనా నుంచి కోలుకోవడంతో స్వదేశానికి తిరిగి బయల్దేరాడు. ప్రస్తుతం అక్కడ క్వారంటైన్లో ఉన్న సీఫెర్ట్.. కరోనా సోకిన సమయంలో భారత్‌లో తన అనుభవాలను ఆన్లైన్ ద్వారా మీడియాతో పంచుకున్నాడు. ఈ సందర్బంగా ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సీఫెర్ట్ బోరున విలపించాడు. కరోనా సోకిందని తెలియగానే గుండె భారంగా మారిందని, అదే సమయంలో భారత్‌లో నెలకొన్న విపత్కర పరిస్థితుల గురించి తెలుసుకొని ప్రాణాలతో ఇంటికి చేరుతానా.. లేదా.. అన్న సందేహం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. భారత్‌లో ఆక్సిజన్ కొరత, ఆస్పత్రిలో బెడ్ల కొరత తనను కంగారు పెట్టాయని గుర్తు చేసుకున్నాడు. అయితే, సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ ధైర్యం చెప్పడంతో కాస్త కుదుట పడ్డానన్నాడు. కాగా, ఐపీఎల్ 2021 సీజన్ కోసం కేకేఆర్ జట్టుకు ఎంపికైన అమెరికా ఆటగాడు అలీ ఖాన్ గాయపడటంతో అతని స్థానంలో సిఫెర్ట్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులోకి వచ్చాడు. అయితే, లీగ్ రద్దు కావడంతో స్వదేశానికి బయల్దేరదామని భావించిన అతనికి షాకింగ్ న్యూస్ తెలిసింది. ఫ్లైట్ ఎక్కే ముందు చేసిన కరోనా టెస్టుల్లో అతనికి పాజిటివ్ గా తేలింది. దీంతో అతన్ని చెన్నైలోని క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాక ఇటీవలే న్యూజిలాండ్‌కు వెళ్లాడు. ఇదిలా ఉంటే, కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌లోని మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈ వేదికగా సెప్టెంబర్, అక్టోబర్ మధ్య నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. చదవండి: వీడియో కాల్లో చూసి కోవిడ్ అని చెప్పేసింది.. -
ఆర్సీబీ ప్లేయర్ విధ్వంసం..
అక్లాండ్: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి టీ20లో న్యూజిలాండ్ యువ క్రికెటర్ ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కెరీర్లో మూడో టీ20 ఆడుతున్న అలెన్.. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అలెన్(29 బంతుల్లో 71; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసంతో న్యూజిలాండ్ 65 పరుగుల తేడాతో బంగ్లా చిత్తు చేసి, 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఫిన్ అలెన్.. ఈ ఏడాది ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీంతో అలెన్ విధ్వంసకర ఇన్నింగ్స్ చూసిన ఆర్సీబీ అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కాగా, ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జోష్ ఫిలిప్ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2021 నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో ఫిన్ అలెన్‌ను ఆర్సీబీ కనీస ధరకు(రూ.20 లక్షలు) దక్కించుకుంది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ను 10 ఓవర్లకు కుదించగా.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. ఫిన్ అలెన్‌కు అండగా మార్టిన్ గప్తిల్(19 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్‌లతో 44) చెలరేగి ఆడాడు. అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన బంగ్లా జట్టు.. 9.3 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో మహమ్మద్ నైమ్(19), సౌమ్య సర్కార్( 10), మోసెద్దెక్ హుసేన్(13) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో టాడ్ ఆస్టల్ 4, సౌథీ 3 వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉండగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సైతం న్యూజిలాండ్ 3-0తో వైట్‌వాష్ చేసింది. చదవండి: ఆనంద్ మహీంద్రాకు నట్టూ రిటర్న్ గిఫ్ట్.. -
మున్రో విధ్వసం
ఆక్లాండ్: దుమ్మురేపే బ్యాటింగ్‌తో చెలరేగిన న్యూజిలాండ్ జట్టు... శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ (2-0) చేసింది. కొలిన్ మున్రో (14 బంతుల్లో 50 నాటౌట్; 1 ఫోర్, 7 సిక్సర్లు), మార్టిన్ గప్టిల్ (25 బంతుల్లో 63; 6 ఫోర్లు, 5 సిక్సర్లు)ల సంచలన ఆటతీరుతో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లోనూ కివీస్ 9 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. ఈడెన్ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులు చేసింది. మ్యాథ్యూస్ (49 బంతుల్లో 81 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దిల్షాన్ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు)లు మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఇలియట్ 4, సాంట్నెర్, మిల్నే చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన కివీస్‌ను లంక బౌలర్లు నిలువరించలేకపోయారు. దీంతో ఆతిథ్య జట్టు కేవలం 10 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 147 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు గప్టిల్, విలియమ్సన్ (21 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడుతూ 40 బంతుల్లోనే తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. తర్వాత మున్రో సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. ఎదుర్కొన్న ప్రతి బంతిని బౌండరీ లైన్ దాటించేందుకు ప్రయత్నించాడు. ఫలితంగా 14 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశాడు. టి20ల్లో ఇది రెండో ఫాస్టెస్ట్ అర్ధసెంచరీ కాగా, కివీస్ తరఫున వేగవంతమైన అర్ధసెంచరీ. అంతకుముందు గప్టిల్ కూడా 19 బంతుల్లోనే 50 పరుగులు చేసినా.. మున్రో జోరు ముందు తన రికార్డు (కివీస్ తరఫున ఫాస్టెస్ట్ అర్ధసెంచరీ) 20 నిమిషాల్లోనే మరుగున పడిపోయింది. మున్రోకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. -
టి-20 క్రికెట్లో 20 నిమిషాల్లోనే 2 రికార్డులు
ఆక్లాండ్: న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గుప్టిల్, కొలిన్ మున్రో వీరబాదుడు బాదేశారు. 20 నిమిషాల్లో రెండు రికార్డులను బద్దలు కొట్టారు. టి-20 క్రికెట్లో న్యూజిలాండ్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా గుప్టిల్ రికార్డు నెలకొల్పగా, మున్రో కాసేపట్లోనే దీన్ని బ్రేక్ చేశాడు. శ్రీలంక, న్యూజిలాండ్ రెండో టి-20 ఈ రికార్డులకు వేదికైంది. శ్రీలంకతో ఆదివారం జరిగిన రెండో టి-20లో కివీస్ 9 వికెట్లతో ఘనవిజయం సాధించి.. సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులు చేసింది. మాథ్యూస్ (49 బంతుల్లో 81) మెరుపు అజేయ హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం 143 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం 10 ఓవర్లలో వికెట్ నష్టానికి సాధించింది. గుప్టిల్ (25 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 63), మున్రో (14 బంతుల్లో ఫోర్, 7 సిక్సర్లతో 50 నాటౌట్) రికార్డు హాఫ్ సెంచరీలు చేశారు. గుప్టిల్ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. న్యూజిలాండ్ తరపున పొట్టి క్రికెట్లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. అయితే కాసేపటి తర్వాత మున్రో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడంతో గుప్టిల్ రికార్డు బద్దలైంది. అంతేగాక, ప్రపంచ టి-20 క్రికెట్లో రెండో వేగవంతమై హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా మున్రో మరో రికార్డు నమోదు చేశాడు. భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (12 బంతుల్లో) రికార్డు ఉంది.