PC: IPL.com
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ నాలుగో ఓటమి చవిచూసింది. వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముంబై పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.
207 పరుగుల లక్ష్య చేధనలో ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి రోహిత్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఆఖరి వరకు అద్బుతమైన పోరాటం చేసినప్పటికి తన జట్టును మాత్రం హిట్‌మ్యాన్ గెలిపించలేకపోయాడు. రోహిత్‌కు మరో ఆటగాడి సపోర్ట్ ఉండి ముంబై కచ్చితంగా విజయం సాధించిండేది.
రోహిత్ సెంచరీ చేసినప్పటికి ఎటువంటి సెలబ్రేషన్స్ కూడా జరుపుకోలేదు. రోహిత్ సెంచరీ వృథాగా మిగిలిపోయింది. 63 బంతుల్లో హిట్‌మ్యాన్.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రోహిత్‌కు ఇది రెండో ఐపీఎల్ సెంచరీ. రోహిత్ శర్మ చివరగా 2012 ఐపీఎల్ సీజన్‌లో సెంచరీ సాధించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులకే పరిమితమైంది. సీఎస్‌కే బౌలర్లలో పతిరాన అద్బుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. తన 4 ఓవర్ల కోటాలో 28 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన పతిరానకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ROHIT SHARMA, A HUNDRED TO REMEMBER FOREVER. 🫡
— Johns. (@CricCrazyJohns) April 14, 2024
What a fightback, Lone Warrior for MI. pic.twitter.com/neT5HwxiO7
Comments
Please login to add a commentAdd a comment