
రుతురాజ్ గైక్వాడ్(ఫైల్ ఫోటో)
రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా నాసిక్ వేదికగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో 439 పరుగుల తేడాతో మహారాష్ట్ర ఘన విజయం సాధించింది. 617 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా కేవలం 177 పరుగులకే కుప్పకూలింది. మహారాష్ట్ర బౌలర్లలో ముఖేష్ చౌదరి 5 వికెట్లు పడగొట్టగా.. రజనీష్ గుర్బానీ మూడు వికెట్లు, రామక్రిష్ణ రెండు వికెట్లు సాధించారు.
బరోడా బ్యాటర్లలో అతి సేథ్(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా..జ్యోత్స్నిల్ సింగ్(40) పరుగులతో రాణించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో బరోడా కెప్టెన్ కృనాల్ పాండ్యా(12, 6) తీవ్ర నిరాశపరిచాడు.
కాగా మహారాష్ట్ర జట్టు 464/7 వద్ద తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మహారాష్ట్ర బ్యాటర్లలో సౌరభ్ నవలే(126) సెంచరీతో మెరవగా..రామక్రిష్ణ(99), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(89) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
అయితే మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 152 పరుగుల ఆధిక్యాన్ని జోడించి బరోడా ముందు 617 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. ఈ భారీ లక్ష్యాన్ని బరోడా చేధించడంలో చతకలపడింది. కాగా మహారాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌట్ కాగా..బరోడా 145 పరుగులకే తమ మొదటి ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్.. ప్రపంచంలో తొలి ప్లేయర్‌గా