రంజీ ట్రోఫీ 2024లో భాగంగా జమ్మూ అండ్ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మహారాష్ట్ర కెప్టెన్, టీమిండియా ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రుతు 86 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓ పక్క రుతురాజ్ సెంచరీ చేజార్చుకోగా సహచరుడు సిద్దేశ్ వీర్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
మూడో రోజు టీ విరామం సమయానికి మహారాష్ట్ర స్కోర్ 3 వికెట్ల నష్టానికి 221 పరుగులుగా ఉంది. సిద్దేశ్ వీర్ (100), అంకిత్ బావ్నే (9) క్రీజ్‌లో ఉన్నారు. మహారాష్ట్ర ఇన్నింగ్స్‌లో ముర్తజా ట్రంక్‌వాలా (0), సచిన్ దాస్ (10) నిరాశపరిచారు. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్లలో రసిక్ దార్ సలామ్ రెండు వికెట్లు పడగొట్టగా.. యుద్ద్‌వీర్ సింగ్ చరక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం మహారాష్ట్ర జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే 298 పరుగులు వెనుకపడి ఉంది.
అంతకుముందు జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 519 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభమ్ ఖజూరియా డబుల్ సెంచరీతో (255), శివాంశ్ శర్మ (106 నాటౌట్) అజేయ సెంచరీతో విజృంభించారు. వీరిద్దరు మినహా జమ్మూ అండ్ కశ్మీర్ ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. శుభమ్ పుండిర్ 37, డోగ్రా 30, ఆబిద్ ముస్తాక్ 29 (నాటౌట్) పరుగులు చేశారు. మహారాష్ట్ర బౌలర్లలో హితేశ్ వలుంజ్ 4 వికెట్లు పడగొట్టగా.. అర్షిన్ కులకర్ణి, ముకేశ్ చౌదరీ, రజినీష్ గుర్బానీ తలో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment