
కెప్టెన్ల విషయంలో ఐపీఎల్ 2024కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సీజన్‌లో కెప్టెన్లుగా వ్యవహరించనున్న వారిలో ముగ్గురికి (గిల్, కమిన్స్, రుతురాజ్) ఇప్పటివరకు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం లేదు. పది మంది కెప్టెన్లలో సగం మంది 30 ఏళ్లలోపు వారే ఉన్నారు. ఈ సీజన్ అతి పెద్ద వయస్కుడైన కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (ఆర్సీబీ) కాగా.. అతి చిన్న వయస్కుడిగా శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్) ఉన్నాడు. ప్రస్తుత కెప్టెన్లలో ఎవరూ కూడా మూడేళ్ల కిందట ఆయా జట్లకు కెప్టెన్లుగా లేకపోవడం అన్నింటికంటే ప్రత్యేకం.
The captains photoshoot video. 📸🏆pic.twitter.com/jDPkEsod2O
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 21, 2024
ప్రస్తుత కెప్టెన్లలో శ్రేయస్ అయ్యర్ అందరి కంటే అనుభవజ్ఞుడు. అయ్యర్ కేకేఆర్‌ను 55 మ్యాచ్‌ల్లో ముందుండి నడిపించాడు. ఆతర్వాత కేఎల్ రాహుల్ (లక్నోను 51 మ్యాచ్‌ల్లో), సంజూ శాంసన్ (రాజస్థాన్ రాయల్స్‌ను 45 మ్యాచ్‌ల్లో), హార్దిక్ పాండ్యా (గుజరాత్‌ను 31 మ్యాచ్‌ల్లో), రిషబ్ పంత్ (ఢిల్లీని 30 మ్యాచ్‌ల్లో), డుప్లెసిస్ (ఆర్సీబీని 27 మ్యాచ్‌ల్లో), శిఖర్ ధవన్ (పంజాబ్‌ను 22 మ్యాచ్‌ల్లో) సీనియర్లుగా ఉన్నారు.
కాగా, క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 సీజన్ రేపటి నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రేపు రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
చదవండి: IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం.. ధోని స్థానంలో కొత్త కెప్టెన్