IPL 2024: సీఎస్‌కేతో మ్యాచ్‌.. భారీ రికార్డులపై కన్నేసిన విరాట్‌ కోహ్లి | IPL 2024: Virat Kohli Eyes On Many Huge Records In CSK VS RCB Season Opener Match, See Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2024 CSK Vs RCB: సీఎస్‌కేతో మ్యాచ్‌.. భారీ రికార్డులపై కన్నేసిన విరాట్‌ కోహ్లి

Published Wed, Mar 20 2024 5:58 PM | Last Updated on Wed, Mar 20 2024 6:38 PM

IPL 2024: Virat Eyes On Few Records In CSK VS RCB Season Opener - Sakshi

ఐపీఎల్‌ 17వ ఎడిషన్‌ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్‌) వేదికగా జరిగే సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఆర్సీబీతో తలపడుతుంది. ఈ బిగ్‌ ఫైట్‌ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. 

ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పలు భారీ రికార్డులపై కన్నేశాడు. అవేంటంటే..

  • సీఎస్‌కేతో మ్యాచ్‌లో విరాట్‌ మరో 6 పరుగులు చేస్తే.. టీ20ల్లో 12000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం విరాట్‌ ఖాతాలో 11994 పరుగులు ఉన్నాయి. ఈ జాబితాలో విరాట్‌ తర్వాత రోహిత్‌ శర్మ (11156), శిఖర్‌ ధవన్‌ (9645) ఉన్నారు. 
  • ఈ మ్యాచ్‌లో విరాట్‌ మరో క్యాచ్‌ పడితే టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం విరాట్‌.. సురేశ్‌ రైనాతో కలిసి టాప్‌లో ఉన్నాడు. వీరిద్దరు టీ20ల్లో 172 క్యాచ్‌లు పట్టారు.
  • ఈ మ్యాచ్‌లో విరాట్‌ మరో పరుగు చేస్తే సీఎస్‌కేపై 1000 పరుగుల మార్కును తాకుతాడు.
  • ఈ మ్యాచ్‌లో విరాట్‌ మరో 4 క్యాచ్‌లు పడితే ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం విరాట్‌ ఖాతాలో 106 క్యాచ్‌లు ఉండగా.. రైనా 109 క్యాచ్‌లతో టాప్‌లో ఉన్నాడు.  
  • ఈ మ్యాచ్‌లో విరాట్ మరో హాఫ్‌ సెంచరీ చేస్తే ఐపీఎల్‌లో సీఎస్‌కేపై 10 హాఫ్‌ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. 
  • ఈ మ్యాచ్‌లో విరాట్‌ మరో 124 పరుగులు చేస్తే టీ20 క్రికెట్‌ చరిత్రలో ఓ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. 

ముష్ఫికర్‌ రహీం (ఢాకాలో 3239 పరుగులు)
విరాట్‌ కోహ్లి (బెంగళూరులో 3116)
అలెక్స్‌ హేల్స్‌ (నాటింగ్హమ్‌లో 3036)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement