ఐపీఎల్ 2024 సీజన్‌లో నిన్న మూడో సెంచరీ నమోదైంది. ఈ ఎడిషన్‌లో విరాట్ కోహ్లి, జోస్ బట్లర్ ఇప్పటివరకు సెంచరీలు చేయగా.. తాజాగా రోహిత్ శర్మ వీరి సరసన చేరాడు. సీఎస్‌కేతో నిన్న (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మూడంకెల స్కోర్‌ను చేరుకున్నాడు. రోహిత్ బ్యాట్ నుంచి చాలాకాలం తర్వాత జాలువారిన శతకం ఇది. ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్ శర్మకు ఇది చాలా ప్రత్యేకం.
అడపాదడపా ఫామ్.. వయసు మీద పడటం.. కెప్టెన్సీ పోవడం వంటి విపత్కర పరిస్థితుల్లో హిట్‌మ్యాన్ తన సొంత మైదానంలో సెంచరీ చేసి శభాష్ అనిపించుకున్నాడు. రోహిత్ సెంచరీతో ముంబై అభిమానులు మురిసిపోయారు. ఈ సెంచరీ రోహిత్‌కు సైతం చిరకాలం గుర్తుండిపోతుంది. రోహిత్ బౌండరీ బాది సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే వాంఖడే స్టేడియంలో సంబురాలు అంబరాన్ని అంటాయి.
అభిమానుల కేరింతులు, చప్పట్ల ధ్వనులతో స్టేడియం మార్మోగిపోయింది. ప్రత్యర్ది డగౌట్ సహా స్టేడియం మొత్తం హిట్‌మ్యాన్‌కు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చింది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే హిట్‌మ్యాన్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత సంబురాలకు దూరంగా ఉన్నాడు. యావత్ క్రికెట్ ప్రపంచం తన సెంచరీని సెలబ్రేట్ చేసుకుంటుంటే హిట్‌మ్యాన్ మాత్రం తన సహజ శైలి భిన్నంగా సైలెంట్‌గా ఉన్నాడు.
ROHIT SHARMA, A HUNDRED TO REMEMBER FOREVER. 🫡
— Johns. (@CricCrazyJohns) April 14, 2024
What a fightback, Lone Warrior for MI. pic.twitter.com/neT5HwxiO7
రోహిత్ ముఖంలో సాధించానన్న కసి కనిపించినప్పటికీ అది బయట పడకుండా చాలా ఉద్వేగంగా కనిపించాడు. సెంచరీ అనంతరం రోహిత్ నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న మొహమ్మద్ నబీతో కరచాలనం చేసి నామమాత్రంగా బ్యాట్‌ను పైకి లేపాడు. ఇంతకు మించి రోహిత్ ఏ సెలబ్రేషన్స్ చేసుకోలేదు. ముంబై ఓటమి అప్పటికే ఖరారు కావడంతో రోహిత్ మిన్నకుండిపోయాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
🔥RO X RUTHLESS 🔥pic.twitter.com/jUpTjLPQXx
— CricTracker (@Cricketracker) April 14, 2024
హిట్‌మ్యాన్ యాటిట్యూడ్‌ను అంతా ప్రశంశిస్తున్నారు. ఎంత సాధించినా ఒదిగి ఉండటం అంటే ఇదే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు రోహిత్ సెంచరీని తప్పుబడుతున్నారు. హిట్‌మ్యాన్ సెంచరీ కోసం చాలా స్వార్దంగా బ్యాటింగ్ చేశాడని అంటున్నారు. అందుకే ఈ మ్యాచ్‌లో ముంబై ఓడిందని అంటున్నారు. రోహిత్ సెంచరీ కోసం కాకుండా తన సహజ శైలిలో బ్యాటింగ్ చేసుంటే ముంబై గెలిచుండేదని చర్చించుకుంటున్నారు.
భారీ లక్ష్య ఛేదనలో (207) ఇలాగేనా బ్యాటింగ్ చేసేదంటూ రోహిత్ వ్యతిరేకులు పేలిపోతున్నారు. ఈ మ్యాచ్‌లో తాము ఓడినా రోహిత్ శర్మ సెంచరీ తృప్తినిచ్చిందని ముంబై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఈ మ్యాచ్‌లో ముంబై సీఎస్‌కే చేతిలో 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే.. రుతురాజ్ (40 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్ దూబే (38 బంతుల్లో 66 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో ధోని (4 బంతుల్లో 20 నాటటౌ్; 3 సిక్సర్లు) హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్సర్ల బాదడంతో సీఎస్‌కే 200 పరుగుల మార్కును దాటింది.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రోహిత్ శర్మ (63 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) శతక్కొట్టినప్పటికీ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ధోని ఆఖరి ఓవర్‌లో చేసిన 20 పరుగులే ముంబై ఓటమికి కారణమయ్యాయని నెటిజన్లు అనుకుంటున్నారు. 4 వికెట్లు తీసిన పతిరణ ముంబై ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment