ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కెప్టెన్‌గా ధోని శకం నేటితో ముగిసింది. సీఎస్‌కే సారధ్య బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలిగిన ధోని.. తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్ పేరును ప్రకటించాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో రుతు సీఎస్‌కేను ముందుండి నడిపించనున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ జట్టుకు కెప్టెన్ హోదాలో ధోని ఐపీఎల్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు.
ఐపీఎల్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న ధోని కెరీర్‌పై లుక్కేస్తే... 42 ఏళ్ల ధోని ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా (2010, 2011, 2018, 2021, 2023) నిలబెట్టాడు. మరో ఐదుసార్లు రన్నరప్‌గా (2008, 2012, 2013, 2015, 2019) టైటిల్‌కు అడుగు దూరం వరకు తీసుకెళ్లాడు. 2016లో ధోని రైజింగ్ పూణే సూపర్ జెయింట్ జట్టుకు కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఐపీఎల్‌లో ధోని గణాంకాలు..
- మ్యాచ్‌లు: 250
- పరుగులు: 5082
- అత్యధిక స్కోర్: 2019లో ఆర్సీబీపై 48 బంతుల్లో 84 నాటౌట్
- శతకాలు: 0
- అర్దశతకాలు: 22
- సిక్సర్లు: 239
- ఫోర్లు: 349
వికెట్‌కీపర్‌గా..
- మ్యాచ్‌లు: 243
- 138 క్యాచ్‌లు
- 42 స్టంపింగ్‌లు
ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ధోని గణాంకాలు..
- మ్యాచ్‌లు: 226
- పరుగులు: 4660
- అత్యధిక స్కోర్: 2019లో ఆర్సీబీపై 48 బంతుల్లో 84 నాటౌట్
- శతకాలు: 0
- అర్దశతకాలు: 22
- సిక్సర్లు: 218
- ఫోర్లు: 320
కెప్టెన్ హోదాలో వికెట్‌కీపర్‌గా..
- మ్యాచ్‌లు: 226
- 128 క్యాచ్‌లు
- 39 స్టంపింగ్‌లు
ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ధోని రికార్డు..
- మ్యాచ్‌లు: 226
- విజయాలు: 133
- పరాజయాలు: 91
- టై అయినవి: 0
- ఫలితం తేలనివి: 2
సీఎస్‌కే కెప్టెన్‌గా ధోని రికార్డు..
- మ్యాచ్‌లు: 212
- విజయాలు: 128
- పరాజయాలు: 82
- టై అయినవి: 0
- ఫలితం తేలనివి: 2
Comments
Please login to add a commentAdd a comment