ఐపీఎల్-2023 సీజన్‌కు గానూ కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ కెప్టెన్‌గా నితీష్ రానాను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వెన్నుగాయంతో రెగ్యూలర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో అతడి స్థానంలో కెప్టెన్‌గా నితీష్ రానాను కేకేఆర్ మేనెజ్‌మెంట్ నియమించింది. కెప్టెన్సీ రేసులో రాణాతో పాటు సునీల్ నరైన్,శార్ధూల్ ఠాకూర్ పేర్లు వినిపించినప్పటకీ.. కేకేఆర్ మేనెజ్‌మెంట్ మాత్రం నితీష్ వైపు మెగ్గు చూపింది.
కాగా నితీశ్ రాణాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడం పట్ల కేకేఆర్ ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జట్టులో షకీబుల్ హసన్, టిమ్ సౌథీ, నరైన్ వంటి అనుభవం ఉన్న క్రికెటర్లను పక్కన పెట్టి నితీశ్ రాణాను నియమించడం సరికాదని అభిమానులు కామెంట్స్ చేస్తోన్నారు. కెప్టెన్‌గా జట్టును నడిపించే సామర్థ్యం, అనుభవం నితీష్ రానాకు లేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం రాణాకు మద్దతుగా నిలుస్తున్నారు.
అతడికి కెప్టెన్సీ పరంగా అనుభవం ఉందంటూ సపోర్ట్ చేస్తున్నారు. కాగా రాణాకు కెప్టెన్సీ ఏం కొత్త కాదు. దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టుకు రాణా సారథ్యం వహించాడు. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ తర్వాత ఢిల్లీ జట్టుకు రాణానే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అదే విధంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 12 మ్యాచులకు కెప్టెన్సీ చేశాడు. అతడి సారథ్యంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment