కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణా భార్య సాచి మర్వా రాణా.. తనను ఇబ్బంది పెట్టిన ఇద్దరు యువకుల పట్ల జాలి చూపించి, పెద్ద మనసు చాటుకుంది. కొద్ది రోజుల క్రితం సాచి మర్వాను దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు యువకులు బైక్‌పై వెంబడించారు. ఆ ఇద్దరు యువకులు కారును వెంబడించడమే కాకుండా ఉద్దేశపూర్వకంగా పలు మార్లు బైక్‌తో సాచి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టారు.
యువకుల ప్రవర్తనతో భయాందోళనకు గురైన సాచీ.. విషయాన్ని ఫోన్ ద్వారా పోలీసులకు చేరవేసింది. అయితే పోలీసుల నుంచి ఆమెకు తగినంత రెస్పాన్స్ రాలేదు. దీంతో యువకులు కారును వెంబడిస్తున్నప్పుడు తీసిన వీడియోను, జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె తన ఇన్‌స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. విషయం వైరల్ కావడంతో సదరు యువకులను ట్రేస్ చేసిన పోలీసులు, వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
#Watch: 2 men stalk & chase #KKR captain Nitish Rana's wife's car in #Delhi, she shares #video#NitishRana #SaachiMarwah #viral #news #Police
— UnMuteINDIA (@LetsUnMuteIndia) May 6, 2023
Subscribe to our YouTube page: https://t.co/bP10gHsZuP pic.twitter.com/IxYAdGZyrv
అయితే, విషయం గురించి సమాచారం అందుకున్న సాచి.. సదరు యువకుల బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకుని, వారిని కాస్త స్మూత్‌గా డీల్ చేయాలని పోలీసులను కోరింది. వారిరువురు స్కూల్ పిల్లలని తెలియడంతో ఆమె ఇలా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. తెలిసి తెలియక వారు అలా ప్రవర్తించి ఉండవచ్చు.. వారిని మందలించి వదిలేయండి.. కేసులు కట్టి వారి జీవితాలను పాడు చేయవద్దని ప్రాధేయపడినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, ఐపీఎల్-2023లో సాచి భర్త నితీశ్ రాణా సారధ్యం వహిస్తున్న కేకేఆర్ 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. మే 8న జరగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో కేకేఆర్.. పంజాబ్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది.
చదవండి: నిప్పు ఉప్పులా ఉండే కోహ్లి, గంగూలీ కలిసిపోయారు.. కోహ్లి ఇక ఢిల్లీకి వచ్చేయ్..!
Comments
Please login to add a commentAdd a comment