Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు నితీష్ రాణాకు నిర్వాహకులు జరిమానా విధించారు. ఫలితంగా అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పడింది. కేకేఆర్ ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన మురగన్ అశ్విన్ బౌలింగ్‌లో.. రాణా మిడ్ వికెట్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బంతి నేరుగా ఫీల్డర్ డేనియల్ శామ్స్ చేతికి వెళ్లింది. దీంతో అసహానానికి గురైన రాణా.. పెవిలియన్‌కి వెళ్తూ బౌండరీ లైన్‌కి వెలుపల ఉన్న అడ్వర్‌టైజ్‌మెంట్ బోర్డుని బ్యాట్‌తో కొట్టాడు. అయితే రాణా లెవల్-1 నియమావళిని ఉల్లంఘించినందుకు మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు.
మరోవైపు ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మ్యాచ్ రిఫరీ మందలించాడు. బుమ్రా కూడా తన నేరాన్ని అంగీకరించాడు. అయితే బుమ్రా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఎక్కడ ఉల్లంఘించాడన్నది విషయంపై ఐపీఎల్ నిర్వాహకులు స్పష్టతనివ్వలేదు. ఇక ముంబై ఇండియన్స్‌పై కేకేఆర్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. ప్యాట్ కమిన్స్ చెలరేగడంతో 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.
కమిన్స్ 15 బంతుల్లో 56 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. అతడితో పాటు ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ 50 పరుగులతో రాణించాడు. ముంబై బౌలర్లలో మురుగన్ అశ్విన్, టైమల్ మిల్స్ చెరో రెండు వికెట్లు తీయగా.. డేనియల్ సామ్స్ ఒక వికెట్ తీశాడు. కాగా అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (52), తిలక్ వర్మ (38) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో కమిన్స్ 2, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి చెరొక వికెట్ తీశారు.
చదవండి: KKR vs MI: డేనియల్ సామ్స్ చెత్త రికార్డు.. రోహిత్‌కు ఆ అవకాశం ఇస్తే కదా!
Comments
Please login to add a commentAdd a comment