Reports: Nitish Rana Suffers Ankle Injury During KKR Practice Session - Sakshi
Sakshi News home page

IPL 2023: ఐపీఎల్‌కు ముందు కేకేఆర్‌కు ఊహించని షాక్‌! ఇక అంతే సంగతి?

Published Fri, Mar 24 2023 3:09 PM | Last Updated on Fri, Mar 24 2023 3:57 PM

Reports: Nitish Rana suffers ankle injury during KKR practice session - Sakshi

ఐపీఎల్‌-2023 సీజన్‌ ఆరంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గరువారం జరిగిన  ప్రాక్టీస్ సెషన్‌లో ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ నితీష్ రాణా యాంకిల్‌ (చీలమండ)కు గాయమైనట్లు తెలుస్తోంది.

దీంతో అతడు ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక ఇప్పటికే ఈ ఏడాది ఐపీఎల్‌కు కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు, స్టార్‌ బౌలర్‌ లాకీ ఫెర్గూసన్ కూడా దూరమయ్యాడు.

ఇప్పడు రాణా కూడా గాయపడడం కేకేఆర్‌ను మరింత కలవరపెడుతోంది. ఇక ఇది ఇలా ఉండగా.. కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌ను రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. కెప్టెన్సీ రేసులో విండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌తో పాటు, న్యూజిలాండ్‌ టెస్టు కెప్టెన్‌ టిమ్‌ సౌథీ ఉన్నారు. ఇక ఐపీఎల్‌-16వ సీజన్‌ మార్చి31 నుంచి ప్రారంభం కానుంది. కేకేఆర్‌ తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్‌1న పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది.
చదవండి: Ben Stokes: 'నేను వచ్చేశా'.. సీఎస్‌కే ఫ్యాన్స్‌లో జోష్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement