
ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్ మరో ఓటమి చవి చూసింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో ముంబై పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ.. తొలుత పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ను 15 ఓవర్ల వరకు ముంబై బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు.
పంజాబ్ 15 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు మాత్రమే చేసింది. ఇక్కడే ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పిదం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. 16 ఓవర్ వేసేందుకు అద్భుతంగా బౌలింగ్ చేసిన వెటరన్ స్పిన్నర్ పియూష్ చావ్లాను కాదని, అంత అనుభవం లేని అర్జున్ టెండూల్కర్‌ను రోహిత్ తీసుకువచ్చాడు.
ఇదే ముంబై కొంపముంచింది. 16 ఓవర్ వేసిన అర్జున్ ఏకంగా 31 పరుగులు సమర్పించకున్నాడు. ఇక్కడి నుంచి ఊచకోత మొదలు పెట్టిన పంజాబ్ బ్యాటర్లు.. చివరి ఐదు ఓవర్లలో 96 పరుగులు చేశారు. ఇక రోహిత్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు ముంబై అభిమానులు తప్పబడుతున్నారు.
పియూష్ చావ్లా ఓవర్ల కోటాను రోహిత్ ఎందుకు పూర్తి చేయలేదో అర్ధం కావడం లేదని సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. "రోహిత్ చేసిన తప్పుకు అంతగా అనుభవం లేని అర్జున్ బలైపోయాడు" మరి కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన చావ్లా కేవలం 15 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
కాగా అంతకుముందు రెండు మ్యాచ్‌ల్లోనూ అర్జున్‌తో రోహిత్ రెండు ఓవర్లు మాత్రమే వేయించాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో మాత్రం అర్జున్‌కు మరో ఓవర్ ఇచ్చి రోహిత్ తప్పు చేశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన అర్జున్.. ఏకంగా 48 పరుగులిచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు.
చదవండి: IPL 2023: అతడే మా కొంప ముంచాడు.. బాధపడాల్సిన అవసరం లేదు! సంతోషంగా ఉంది