PC:IPL.com
ఐపీఎల్-2023లో ఐదు సార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో విజయం సాధించిన ముంబై.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.కాగా ఈ మ్యాచ్‌లో ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.
సూర్య 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఇది తమకు చాలా కీలకమైన మ్యాచ్ అని, ఈ మ్యాచ్‌లో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని హిట్‌మ్యాన్ తెలిపాడు.
"ఇది మాకు చాలా ముఖ్యమైన మ్యాచ్. రెండు పాయింట్లు సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. మొదట బ్యాటింగ్ చేసి, లక్ష్యాన్ని కాపాడుకోవడం ఆనందంగా ఉంది. మేము వరుస క్రమంలో వికెట్లు సాధిస్తునే ఉన్నాం. టీ20 ఫార్మాట్‌లో అది చాలా ముఖ్యం. మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. ఇక సూర్య తన ఫామ్‌ను తిరిగి పొందాడు. బ్యాటింగ్‌లో రైట్, లెఫ్ట్ కాంబినేషన్ కొనసాగించాలని అనుకున్నాం.
కానీ సూర్య ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వెళ్తా అన్నాడు. అంత కాన్ఫిడెన్స్‌తో ఉన్న సూర్యను మేము తను అనుకున్నట్టు ముందే బ్యాటింగ్‌కు పంపాం. మా ప్లాన్‌ను మార్చుకున్నాం. అతడు ప్రతీ మ్యాచ్‌లో అతడు విధ్వంసం సృష్టించాలి అనుకుంటాడు. చివరి మ్యాచ్ ఎలా జరిగిందని అసలు ఆలోచించడు. గత మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించామన్న గర్వం అస్సలు సూర్యకు ఉండదు" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
చదవండి: మేమంతా విఫలమయ్యాం.. అతడొక్కడే అదరగొట్టాడు! టర్న్ చేస్తాడని అనుకున్నా: హార్దిక్
Comments
Please login to add a commentAdd a comment