
PC: IPL Twitter
ఐపీఎల్-2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (మే 12) జరుగుతున్న కీలక మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరోసారి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌కు మంచి ఆరంభమే లభించినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు.
మోహిత్ శర్మ వేసిన రెండో ఓవర్‌లో రెండు బౌండరీలు, ఓ సిక్సర్, ఆతర్వాతి ఓవర్‌లో షమీ బౌలింగ్‌లో మరో సిక్సర్, ఐదో ఓవర్‌లో నూర్ అహ్మద్ బౌలింగ్‌లో బౌండరీ బాది జోరుమీదున్నట్లు కనిపించిన రోహిత్..ఆరో ఓవర్ తొలి బంతికి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రాహుల్ తెవాతియాకు క్యాచ్ ఇచ్చి 29 (17) పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. ప్రస్తుత సీజన్‌లో ఈ మ్యాచ్‌తో కలిపి ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. కేవలం 220 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క అర్ధసెంచరీ ఉంది.
Who else? @rashidkhan_19 pic.twitter.com/SUoU3nOGzF
— CricTracker (@Cricketracker) May 12, 2023
రోహిత్ ఔటైన ఓవర్‌లోనే ముంబై ఇండియన్స్‌కు మరోషాక్ తగిలింది. 6వ ఓవర్ ఐదో బంతికి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ ఎల్బీడబ్ల్యూ (20 బంతుల్లో 31; 4 ఫోర్లు, సిక్స్)గా వెనుదిరిగాడు. దీంతో ముంబై ఇండియన్స్ 7 ఓవర్లలో 66 పరుగులు చేసి ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.
కాగా, ఈ ఇన్నింగ్స్‌లో 2 సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్.. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి (252) ఎగబాకాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్.. ఏబీ డివిలియర్స్ (251)ను అధిగమించాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (357) అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇదిలా ఉంటే, ఐపీఎల్-2023లో రోహిత్ వరుసగా విఫలమవుతుండటంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హిట్‌మ్యాన్‌ను పక్కకు పెట్టేందుకు సమయం ఆసన్నమైందని కామెంట్లు చేస్తున్నారు. యువ ఆటగాళ్లు చెలరేగిపోతుంటే రోహిత్ కనీస ప్రదర్శనలు కూడా చేయలేకపోతున్నాడని అంటున్నారు. ఇదే ఫామ్ కొనసాగితే హిట్‌మ్యాన్ స్థానం టీమిండియాలో కూడా గల్లంతవుతుందని అభిప్రాయపడుతున్నారు.
చదవండి: నేనెవరినీ స్లెడ్జ్ చేయను.. అది నా అలవాటు కాదు: కోహ్లితో గొడవపడ్డ నవీన్ ఉల్ హక్