ఐపీఎల్-2023లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన అనంతరం ముంబై ఇండియన్స్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌లో వరుసగా మూడు విజయాలు సాధించి మంచి జోష్ మీద ఉన్న ముంబై.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. తమ సొంత మైదానం వాంఖడేలో శనివారం పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముంబై సారధిగా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వర్క్‌లోడ్ దృష్ట్యా రోహిత్ విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా రోహిత్.. పియూష్ చావ్లా స్ధానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గానే బరిలోకి దిగాడు.
అతడి స్థానంలో సూర్యకుమార్ నాయకత్వం వహించాడు. ఇప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ చేయాలని ముంబై మేనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా రోహిత్ కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి తీసుకోనున్నట్లు ఈ టోర్నీ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ సన్నిహిత వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక పంజాబ్‌తో మ్యాచ్‌కు ముంబై స్పీడ్ స్టార్ జోఫ్రా అర్చర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి ఫిట్‌నెస్ సాధించిన అర్చర్ ప్రస్తుతం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)
రమణ్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండాఫ్, జోఫ్రా అర్చర్
చదవండి: IPL 2023: 16 కోట్లు తీసుకున్నావు.. మంచిగా కూర్చోని ఎంజాయ్ చేస్తున్నావు!
Comments
Please login to add a commentAdd a comment