
ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఇక తన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఆకట్టుకునే ప్రదర్శనే చేసిన ముంబై ఇండియన్స్ యువ పేసర్ అర్జున్ టెండూల్కర్.. ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన అర్జున్.. ఏకంగా 48 పరుగులిచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు.
అయితే తొలి రెండు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన అర్జున్, తన మూడో ఓవర్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. తీవ్ర ఒత్తిడికి గురైన టెండూల్కర్ ఆ ఓవర్‌లో ఏకంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు. అందులో ఓ నోబ్, వైడ్ కూడా ఉండడం గమనార్హం. ఇది పంజాబ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఇక ఒకే ఓవర్‌లో భారీగా పరుగులు ఇచ్చిన అర్జున్ టెండూల్కర్ ఓ చెత్త రికార్డును నెలకొల్పాడు.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా గుజరాత్ పేసర్ యశ్ దయాల్‌తో సంయుక్తంగా నిలిచాడు. ఈ టోర్నీలో భాగంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో యశ్ దయాల్ కూడా ఒక ఓవర్‌లో 31 పరుగులు ఇచ్చాడు. ఇదే ఓవర్‌లో కేకేఆర్ ఆటగాడు రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్సర్లు బాదిన సంగతి తెలిసిందే.
చదవండి: IPL 2023: 17 కోట్లు దండగా అన్నారు.. ఇప్పుడు దుమ్ము రేపుతున్నాడు! నోళ్లు మూయించాడుగా
— Guess Karo (@KuchNahiUkhada) April 23, 2023