
లండన్ : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. యూత్ వన్డే సిరీస్‌లో చోటు దక్కకపోవడంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. లండన్‌లో స్నేహితులతో సరదాగా గడుపుతున్న అర్జున్ ఇంగ్లీష్ క్రికెటర్ డేనియల్ వ్యాట్‌ను అర్జున్ కలిశాడు. ఆమెతో లంచ్‌కూ వెళ్లాడు.
ఇందుకు సంబంధించిన ఫొటోను వ్యాట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా, 2014లో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తనను వివాహం చేసుకోవాలని వ్యాట్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.