సచిన్ కొడుకు స్టన్నింగ్ యార్కర్.. దెబ్బకు కిందపడిపోయిన బ్యాటర్‌ | Arjun Tendulkar bamboozles MI batter with toe crushing yorkers ahead of IPL 2024 | Sakshi
Sakshi News home page

IPL 2024: సచిన్ కొడుకు స్టన్నింగ్ యార్కర్.. దెబ్బకు కిందపడిపోయిన బ్యాటర్‌! వీడియో వైరల్‌

Published Tue, Mar 12 2024 4:15 PM | Last Updated on Tue, Mar 12 2024 5:47 PM

Arjun Tendulkar bamboozles MI batter with toe crushing yorkers ahead of IPL 2024 - Sakshi

ఐపీఎల్‌-2024 సీజన్‌ ఆరంభానికి సమయం దగ్గరపడుతోంది. మార్చి 22న చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌- ఆర్సీబీ మధ్య జరగననున్న మ్యాచ్‌తో ఈ ధానాధన్‌ లీగ్‌కు తెరలేవనుంది. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌లో భాగమయ్యే అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌ను మొదలెట్టేశాయి. ఈ క్రమంలో సచిన్‌ తనయుడు, ముంబై ఇండియన్స్‌ యువ పేసర్‌ అర్జున్‌ టెండూల్కర్‌ సైతం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. 

మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ముంబై ప్రీ ట్రైనింగ్‌ క్యాంప్‌లో అర్జున్‌ చెమటోడ్చుతున్నాడు. నెట్స్‌లో ఎ‍క్కువ సమయం పాటు జూనియర్‌ టెండూల్కర్‌  బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో అర్జున్‌ నెట్స్‌లో తన బౌలింగ్‌తో బ్యాటర్లకు  చెమటలు పట్టించాడు. అర్జున్‌ తన సహచర ఆటగాడు నెహాల్ వధేరాను యార్కర్లతో బెంబెలెత్తించాడు.

అర్జున్‌ వేసిన యార్కర్‌ను ఆపలేక వధేరా కిందపడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా గతేడాది సీజన్‌తో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన అర్జున్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఐపీఎల్‌-2023లో మూడు మ్యాచ్‌లు ఆడిన అర్జున్‌.. కేవలం 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

మరి ఈ ఏడాది సీజన్‌లో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. ఐపీఎల్‌-2024లో ముంబై తమ తొలి మ్యాచ్‌లో మార్చి 24న అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది. కాగా ఈ ఏడాది సీజన్‌లో ముంబై సారథిగా హార్దిక్‌ పాండ్యా వ్యహరించనున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement