అవును.. ఒక్కసారి అలా జరిగింది.. ఈ విషయం అర్జున్‌కు గుర్తుచేయకండి: సచిన్‌ | IPL 2023: Sachin Tendulkar Epic Reply To Has Arjun Ever Gotten You Out Viral | Sakshi
Sakshi News home page

Sachin Tendulkar: అవును.. ఒక్కసారి అలా జరిగింది.. ఈ విషయం అర్జున్‌కు గుర్తుచేయకండి: సచిన్‌ ట్వీట్‌ వైరల్‌

Published Sat, Apr 22 2023 1:32 PM | Last Updated on Sat, Apr 22 2023 1:45 PM

IPL 2023: Sachin Tendulkar Epic Reply To Has Arjun Ever Gotten You Out Viral - Sakshi

కొడుకు అర్జున్‌తో సచిన్‌ టెండుల్కర్‌ (PC: IPL/BCCI)

IPL 2023: అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు.. 34,357 పరుగులు.. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్‌గా ఎనలేని కీర్తిప్రతిష్టలు.. క్రికెట్‌ దేవుడంటూ నీరాజనాలు.. టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నెన్నో చిరస్మరణీయ విజయాలు.. అనేకానేక రికార్డులు.. 

గొప్ప ఆటగాడిగా పేరొందిన సచిన్‌ 2013లో రిటైర్‌ అయినా.. అభిమానులు మాత్రం ఏదో ఒక సందర్భంలో అతడి ఘనతలు గుర్తుచేసుకుంటూ నేటికీ ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు సచిన్‌ కుమారుడు అర్జున్‌ వంతు వచ్చింది.

సగటు తండ్రి మనసు
దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఐపీఎల్‌-2023 సీజన్‌తో ముంబై ఇండియన్స్‌ తరఫున అరంగేట్రం చేశాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చిన అర్జున్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తన రెండో మ్యాచ్‌లో తొలిసారి వికెట్‌ పడగొట్టాడు. 

ఈ నేపథ్యంలో సచిన్‌ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. తానెంత ఎత్తుకు ఎదిగినా పిల్లల చిన్న చిన్న ఘనతలే తనకు ఎంతో గొప్ప అని భావించే సగటు తండ్రి మనసును చాటుకుంటున్నాడు. ఈ క్రమంలో ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటించిన సచిన్‌కు ఓ ఫాలోవర్‌ అర్జున్ గురించి ఓ ప్రశ్న అడిగాడు.

అవును.. ఒక్కసారి.. కానీ
సచిన్‌ తొలిసారిగా ట్విటర్‌లో శుక్రవారం నిర్వహించిన #AskSachin సెషన్‌లో.. ‘‘మిమ్మల్ని అర్జున్‌ ఎప్పుడైనా అవుట్‌ చేశాడా?’ అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. ‘‘అవును.. ఒకే ఒక్కసారి.. అది కూడా లార్డ్స్‌లో.. కానీ ఈ విషయం అర్జున్‌కు అస్సలు గుర్తుచేయకండి’’ అని సరదాగా బదులిచ్చాడు.

కాగా సచిన్‌ టెండుల్కర్‌ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌(2008-13)కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అర్జున్‌ అరంగేట్రం నేపథ్యంలో ఐపీఎల్‌లో ఆడిన.. అది కూడా ఒకే జట్టుకు ఆడిన తండ్రీకొడుకులుగా వీరు సరికొత్త చరిత్ర సృష్టించారు. కాగా సచిన్‌ ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ ఐకాన్‌గా ఉన్న విషయం తెలిసిందే.

చదవండి: నువ్వేమీ ముసలోడివి కాలేదు!; సచిన్‌లా 16 ఏళ్లకే ఆట మొదలెడితే: ధోని
16 కోట్లు తీసుకున్నావు.. మంచిగా కూర్చోని ఎంజాయ్‌ చేస్తున్నావు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement