Sachin And Arjun Tendulkar Become First Father-Son Pair To Play IPL - Sakshi
Sakshi News home page

MI VS KKR: రిటైరైనా రికార్డుల్లోకెక్కిన సచిన్‌ టెండూల్కర్‌

Published Mon, Apr 17 2023 1:45 PM | Last Updated on Mon, Apr 17 2023 1:54 PM

Sachin And Arjun Tendulkar Become First Father Son Pair To Play IPL - Sakshi

Photo Credit: MI Twitter

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ క్రికెట్‌ అడకున్నా రికార్డులు మాత్రం కొల్లగొడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న సచిన్‌.. ఐపీఎల్‌-2023లో భాగంగా కేకేఆర్‌తో నిన్న (ఏప్రిల్‌ 16) జరిగిన మ్యాచ్‌ ద్వారా ఓ యూనిక్‌ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌ ద్వారా సచిన్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ ఐపీఎల్‌ అరంగేట్రం చేయడంతో ఐపీఎల్‌ ఆడిన తొట్టతొలి తండ్రి కొడుకుల జోడీగా సచిన్‌-అర్జున్‌ జోడీ రికార్డుపుటల్లోకెక్కింది.

ఈ తండ్రికొడుకుల జోడీ ఒకే ఫ్రాంచైజీకి (ముంబై ఇండియన్స్‌) ప్రాతినిధ్యం వహించడం మరో విశేషం. 16 ఎడిషన్ల ఐపీఎల్‌ చరిత్రలో ఇంతవరకు ఏ తండ్రి కొడుకుల జోడీ ఏ ఫ్రాంచైజీకి ఆడింది లేదు. సచిన్‌.. ఐపీఎల్‌ అరంగేట్రం సీజన్‌ (2008) ద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లోకి అడుగుపెట్టి 2013 ఎడిషన్‌ వరకు కొనసాగగా.. అర్జున్‌ రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2023 సీజన్‌లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

నిన్న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున బరిలోకి దిగిన అర్జున్‌.. 2 ఓవర్లు వేసి వికెట్లేమీ తీసుకోకుండా 17 పరుగులు సమర్పించుకున్నాడు. ఫాస్ట్‌  బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన అర్జున్‌కు ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. కాగా, అర్జున్‌కు ఐపీఎల్‌ (ముంబై ఇండియన్స్‌) ఆడే అవకాశం రావడంతో తండ్రి సచిన్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. సచిన్‌ తన కుమారుడి ఐపీఎల్‌ ఎంట్రీని ఉద్దేశిస్తూ ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు.

‘‘అర్జున్‌.. క్రికెటర్‌గా నీ ప్రయాణంలో ఇదొక ముఖ్యమైన ముందడుగు. ఓ తండ్రిగా.. నిన్నూ, ఆటను ప్రేమించే వ్యక్తిగా.. క్రికెట్‌ పట్ల అంకిత భావంతో ముందుకు సాగుతావని  తెలుసు. ఆటకు నువ్విచ్చే గౌరవాన్ని ఫలితాల రూపంలో తప్పకుండా అందిస్తుంది. ఇక్కడిదాకా చేరుకోవడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. అదే పట్టుదలతో ఈ ప్రయాణాన్ని మరింత అందంగా మార్చుకుంటావని నమ్ముతున్నా. ఆల్‌ ది బెస్ట్‌’’ అంటూ సచిన్‌ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement