సిడ్నీ:ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టీ20 మ్యాచ్ ఆడిన సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ తనదైన మార్కును చూపించాడు. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ గ్లోబల్ ఛాలెంజ్ లో భాగంగా హాంకాంగ్ క్రికెట్ క్లబ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో క్రికెట క్లబ్ ఆఫ్ ఇండియా తరపున బరిలోకి దిగిన అర్జున్ 27 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగిన బౌండరీలతో విరుచుకుపడ్డాడు.
ఆ తర్వాత బౌలింగ్‌లోనూ మెరిసి నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు సాధించాడు. మ్యాచ్ తరువాత మాట్లాడిన ఈ ఎడమ చేతి వాటం ఆటగాడు.. తనకు చిన్నతనం నుంచే ఫాస్ట్ బౌలింగ్ అంటే చాలా ఇష్టమని పేర్కొన్నాడు. దాంతోనే పేస్ బౌలింగ్‌ను ఎంచుకున్నట్లు 18 ఏళ్ల అర్జున్ తెలిపాడు. అర్జున్ ప్రదర్శనపై ఆసీస్ మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. క్రికెట్ దిగ్గజ ఆటగాడు సచిన్‌కు తగ్గ తనయుడు అంటూ కొనియాడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment