సెంచరీతో చెలరేగిన జూనియర్ టెండూల్కర్
బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ క్రికెట్లో అదరగొడుతున్నాడు. అండర్ -16 క్రికెట్లో అర్జున్ సెంచరీతో కదంతొక్కి తండ్రి బాటలో నడుస్తున్నాడు.
ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) అండర్-16 పయ్యాడె ట్రోఫీలో అర్జున్ (106) సెంచరీతో చెలరేగాడు. ఈ ట్రోఫీలో సునీల్ గవాస్కర్ లెవెన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అర్జున్.. రోహిత్ శర్మ లెవెన్ జట్టుపై 156 బంతుల్లో 2 సిక్సర్లు, 16 ఫోర్లతో 106 పరుగులు చేశాడు. అర్జున్ సెంచరీ సాయంతో గవాస్కర్ లెవెన్ జట్టు 218 పరుగులు చేసింది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్ అయిన అర్జున్ బౌలింగ్ కూడా చేశాడు. గత ఐపీఎల్ సీజన్ సందర్భంగా పాకిస్థాన్ పేస్ దిగ్గజం వసీం అక్రమ్ నుంచి అర్జున్ బౌలింగ్ మెళకువలు నేర్చుకున్నాడు.