సచిన్ ను తిట్టాడని.. చేయి చేసుకున్న అర్జున్!
సచిన్ ను తిట్టాడని.. చేయి చేసుకున్న అర్జున్!
Published Sun, Nov 9 2014 9:59 AM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM
తండ్రిని ఎవరైనా నిందిస్తే కొడుకుకు కోపం రావడం సహజం. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ లాంటి వ్యక్తిని నిందిస్తే అభిమానులకే కాకుండా ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ కు కోపం రావడంలో వింతేమి లేదు. అందుకే సచిన్ ను నిందించిన వాళ్లను అర్జున్ వాయించి వదిలేశాడట. అర్జున్ ఏడేళ్ల వయసులో ఉన్నపుడు స్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
2007 సంవత్సరంలో జరిగిన ప్రపంచ కప్ లో భారత జట్టు లీగ్ రౌండ్ లోనే తిరుగుముఖం పట్టింది. కీలక మ్యాచ్ లో సచిన్ సున్నాకే అవుటవ్వడంతో అప్పట్లో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో స్కూల్ లో సచిన్ పై చెత్త కామెంట్స్ చేయడంతో కోపగించిన అర్జున్ వారిపై చేయి చేసుకున్నాడట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సచిన్ స్వయంగా వెల్లడించారు. ఎవరైనా ఏమన్నా కామెంట్ చేస్తే.. వదిలేయాలని తాము చెప్పినట్టు సచిన్ తెలిపారు.
అర్జున్ చేసింది తప్పేనని సచిన్ ఒప్పకున్నాడు. క్రికెట్ పైనే అర్జున్ దృష్టి ఉంది. తనతో అర్జున్ ను పోల్చి చూడకూడదు అని సచిన్ అభిప్రాయపడ్డారు.
Advertisement
Advertisement