
అర్జున్ ఆమ్లెట్లు వేశాడట..
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ భోపాల్ లోని ఒక హోటెల్లో ఆమ్లెట్లు వేసి అక్కడి సిబ్బందినీ, తన స్నేహితులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
భోపాల్ : సెలబ్రెటీలు, వాళ్ల పిల్లలు ఏం చేసినా స్పెషలే... మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ భోపాల్లోని ఓ హోటల్లో ఆమ్లెట్లు వేసి అక్కడి సిబ్బందినీ, తన స్నేహితులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తండ్రిలాగా క్రికెట్ను ప్రేమించే అర్జున్ వంట కూడా బాగా చేస్తాడట.
ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న అర్జున్ మధ్యప్రదేశ్లోని భోపాల్కు రెండు రోజుల పర్యటనకు వెళ్లాడు. ఈ సందర్భంగా స్థానిక హెటల్ కిచెన్లో వెరైటీ ఆమ్లెట్లు వేసి హల్ చల్ చేశాడు. సచిన్ కొడుకు అయినా అర్జున్కు అసలు గర్వం లేదని తమతో చాలా బాగా కలిసిపోయాడని హోటల్ సిబ్బంది ప్రశంసించారు.
కాగా సచిన్కు కూడా గరిటె తిప్పే అలవాటు ఉంది. ఖాళీ సమయం దొరికితే అతడు చికెన్ కర్రీ వండి ఇంట్లోవారికి వడ్డిస్తాడట. అంతేకాదండోయ్ సచిన్ ...చేతి వంటకు టీమిండియా సభ్యులు కూడా ఫిదా అయిపోయేవారట. అడిగి మరీ సచిన్తో చికెన్ కర్రీ చేయించుకొని లొట్టలేసుకుని తినేవారట.