లాహ్లీ (హర్యానా): ఓ స్టార్ క్రికెటర్ వారసుడి మీద ఒత్తిడి ఎలా ఉంటుందో అందరికంటే బాగా తెలిసిన వ్యక్తి రోహన్ గవాస్కర్. సునీల్ గవాస్కర్ కుమారుడిగా కెరీర్ ఆరంభం నుంచే అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఎదుర్కొన్న రోహన్ అంతర్జాతీయ క్రికెటర్‌గా సక్సెస్ కాలేకపోయాడు. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ కూడా ఇదే తరహా ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి అతడిని స్వేచ్ఛగా వదిలేయాలని రోహన్ కోరాడు. ‘స్కూల్ స్థాయి క్రికెట్‌లో అర్జున్ టెండూల్కర్ ఎలా ఆడుతున్నాడనే విషయంపై చర్చించే ఆసక్తి నాకు లేదు.
అతడిని అలా స్వేచ్ఛగా వదిలేయండి. ఈ విషయంపై ఇప్పటికే నేను సచిన్, అంజలిలతోనూ మాట్లాడాను. అందరూ అతడిపై దృష్టి సారించాల్సిన అవసరం లేదు. తండ్రి ప్రభావం అర్జున్‌పై పడకూడదు. అప్పుడే మంచి క్రికెటర్‌గా ఎదుగుతాడు’ అని రోహన్ అన్నాడు.